
పిలోని రాజమండ్రిలో కల్తీ పాలు పెను విషాదాన్ని నింపాయి. నగరంలోని లాలాచెరువు, చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తాగిన మంచి రాధాకృష్ణమూర్తి, యాళ్ళ శేషగిరిరావు, తాడి రమణి, తాడి కృష్ణవేణి, కనక రత్నం చనిపో యారు. అలాగే, మరో నలుగురు చిన్నారులు రాజమండ్రి పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మరో ముగ్గురు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్‌లో స్థానికుల అస్వస్థత, మరణాలపై ఎపి సిఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కల్తీ పాల కారణంగా అనారోగ్యం బారిన పడిన ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్షించారు. చౌడేశ్వరి నగర్‌లో ప్రజలు అనారోగ్యం పాలవ్వడం, పలువురు మరణించడంపై వివరాలు తెలుసుకున్నారు.
ప్రస్తుతం బాధితులకు అందుతున్న వైద్యసాయాన్ని అధికారులు సిఎం చంద్రబాబుకు వివరించారు. చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సాయం అందిం చాలని చంద్రబాబు సూచించారు. ఇక, రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో విక్రయదారులు 106 ఇళ్లకు పాలు పంపిణీ చేస్తున్నారని సిఎం చంద్రబాబుకి అధికారులు వివరించారు. పాలు వినియోగిం చిన కుటుంబాల్లోని 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించినట్లు వెల్లడించారు. మిగి లిన అందరి నుంచి శాంపిల్స్ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలతో పాటు ర్యాపిడ్ టెస్ట్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. పాల నమూనాల్లో ఫలితాల అనంతరం విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే రాజమహేంద్రవరం వెళ్లాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు.