
హైదరాబాద్: అల్లు వారింట పెళ్లి భాజాలు మోగే రోజు దగ్గరపడింది. అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తను ప్రేమించిన నయనికతో శిరీష్ వివాహం మార్చి 6న జరుగనుంది. ఈ నేపథ్యంలో వివాహ పనులు వేగవంతం చేశారు. కొద్ది రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవికి ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రిక అందించిన విషయం తెలిసిందే. తాజాగా ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబును ఈ పెళ్లికి అహ్వానించారు. సతీ సమేతంగా పవన్‌కళ్యాణ్, నాగబాబుల ఇంటికి వెళ్లిన అల్లు అరవింద్.. వారికి నూతన వస్త్రాలు అందించి అందించి పెళ్లికి ఆహ్వానించారు. ఇప్పటికే శిరీష్ వివాహ వేడుకల్లో భాగంగా పసుపు దంచుడు కార్యక్రమం జరిగింది. ఆ ఫోటోలను అల్లు అర్జున్ సతీమణి స్నేహ ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు.