
న్యూఢిల్లీ: ఇరాన్‌లో ఉన్న భారతీయులకు కేంద్రం ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులను వీలైనంత త్వరగా ఇరాన్ నుంచి భారత్‌కు రావాలని పేర్కొంది. అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల ద్వారా త్వరగా రావాలని తెలిపింది. పాస్‌పోర్టులు, ఐడి కార్డులు తమ వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. ఇమిగ్రేషన్ పత్రాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవానలి తెలిపింది. ఇరాన్‌లో నిరసనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. ఇరాన్‌లోని భారత ఎంబసీతో సంప్రదింపులు జరపాలని సూచించింది.