Reading Time: < 1 minute

ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగా.. భారత్ 111 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతొ సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో 76 పరుగుల తేడా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో విఫలం కావడం ఓటమికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరీ ముఖ్యంగా అక్షర్ పటేల్‌ని పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్‌ని జట్టులోకి తీసుకోవడంప విమర్శలు వస్తున్నాయి. తీరా సుందర్‌ని జట్టులోకి తీసుకుంటే అతను బ్యాటింగ్‌లోనూ,, బౌలింనూ విఫలమయ్యాడు. ఈ విషయంపై టీం ఇండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ వివరించాడు. జట్టు కూర్పు కోసమే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేరొన్నాడు. ‘‘మేం ప్లేయింగ్ ఎ గురించి కొన్ని రోజులుగా తీవ్రంగా చర్చించుకున్నాం. జట్టు కూర్పలో వైవిధ్యం కోసమే వాషింగ్టన్ సుందర్‌ని తీసుకున్నాం. బ్యాటింగ్‌లో డెప్త్ కోసం రింకూ సింగ్‌ను కొనసాగించాం. అయితే అంతమాత్రాన అక్షర్ పటేల్ ప్రాధానం తగ్గించినట్లు కాదు. అతడు జట్టులో కీలకమైన ఆటగాడు’ అని ర్యాన్ అన్నాడు.