Reading Time: < 1 minute

హైదరాబాద్: రంగారెడ్డి షాబాద్ మండలం నాగర్ గూడ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను కంటైనర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు హైతాబాద్ గ్రామవాసులు అజయ్(19), ఉదయ్ కిరణ్(20)గా పోలీసులు గుర్తించారు.