Reading Time: < 1 minute
Gujarat Fuel Panic Video People Storing Petrol Utensils Middle East War Rumors

Viral Video: మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ఇంధన కొరత ఏర్పడిందనే వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద జనాలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్‌గా మారాయి. గుజరాత్‌ నుంచి ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. అక్కడ వాహనాల్లోనే కాదు.. ఏకంగా కుక్కర్లు, బాటిళ్లు, పాత్రలు, వాటర్ ట్యాంకుల్లో తీసుకుళ్తున్న వీడియోలు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. మరీ ఇలా ఉన్నారేంట్రా! అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

READ MORE: Mamitha Baiju Offers: స్కైని తాకిన మమితా పాపులారిటీ.. కాల్షీట్స్ కోసం క్యూకడుతున్న ఫిల్మ్ మేకర్స్‌!

ఇదిలా ఉండగా.. పెట్రోల్, డీజిల్ కొరతపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ (LPG) కొరత ఏమాత్రం లేదని తెలంగాణ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ స్పష్టం చేస్తోంది. ఆయిల్ రిఫైనరీల నుంచి స్థానిక డిపోల వరకు ఇంధన సరఫరా యంత్రాంగం పూర్తిగా, సక్రమంగా పనిచేస్తోంది. అన్ని జిల్లాల్లోని ప్రజల రోజువారీ అవసరాలను తీర్చడానికి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. పౌర సరఫరాల శాఖ వివరాల ప్రకారం.. కొన్ని పెట్రోల్ బంకులలో పొడవైన క్యూలు, తాత్కాలికంగా “నో స్టాక్” (No Stock) బోర్డులు కనిపించడానికి ప్రధాన కారణం, తప్పుడు వదంతుల వల్ల ప్రజలు భయపడి అకస్మాత్తుగా ఇంధనం కొనుగోలు చేయడానికి ఎగబడటమే. డిపోలలో తగినంత ఇంధనం ఉన్నప్పటికీ, ప్రజలు అనవసరంగా తమ వాహనాల ట్యాంకులను పూర్తిగా నింపుకోవడానికి పరుగులు తీయడం వల్లే ఈ కృత్రిమ కొరత ఏర్పడుతోందని ప్రభుత్వం ప్రకటించింది.

READ MORE: Fuel Shortage: “అందుకే బంకుల్లో స్టాక్ ఖాళీ అవుతోంది”.. తెలంగాణ పెట్రోలియం డీలర్స్ బిగ్ వార్నింగ్