July 14, 2026

Iran US conflict: అమెరికా తనతో తానే చర్చలు జరుపుతోంది.. కాల్పుల విరమణ ప్రయత్నాలపై ఇరాన్ సైన్యం సెటైర్స్

Iran US conflict: అమెరికా తనతో తానే చర్చలు జరుపుతోంది.. కాల్పుల విరమణ ప్రయత్నాలపై ఇరాన్ సైన్యం సెటైర్స్
Reading Time: < 1 minute
Iran Rejected Americas 15 Point Ceasefire Plan

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధానికి నేటితో 26 రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ఇరాన్ సైనిక ప్రతినిధి ఎగతాళి చేశారు. అమెరికన్లు కేవలం తమలో తామే చర్చలు జరుపుకుంటున్నారని సెటైర్స్ వేశారు. ఇరాన్ సైనిక దళానికి చెందిన ఖతం అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి, లెఫ్టినెంట్ కల్నల్ ఇబ్రహీం జొల్ఫఘారి, ప్రభుత్వ టెలివిజన్‌లో ప్రసారమైన ఒక రికార్డ్ చేసిన వీడియోలో ఈ ప్రకటన చేశారు.

Also Read:BCCI Revenue: ఆర్ఆర్, ఆర్‌సీబీల భారీ డీల్‌లు.. బీసీసీఐకి ఎన్ని కోట్ల లాభమో తెలుసా?

“మీరు ఇంతకుముందు మాట్లాడిన వ్యూహాత్మక బలం ఇప్పుడు వ్యూహాత్మక వైఫల్యంగా మారింది. తమను తాము ప్రపంచ అగ్రరాజ్యాలమని చెప్పుకునేవారు అలా చేయగలిగి ఉంటే, ఈపాటికే ఈ గందరగోళం నుండి బయటపడి ఉండేవారు. మీ ఓటమిని రాజీ అని పిలవకండి. మీ వట్టి వాగ్దానాల శకం ముగిసింది, ” అని ఇరాన్ సైనిక ప్రతినిధి తెలిపారు. యుద్ధాన్ని ముగించడానికి అమెరికా చర్చలు జరుపుతోందన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనను ఇరాన్ మరోసారి తిరస్కరించింది.

Also Read:Gold &Silver Rates: బంగారం, సిల్వర్ ధరల్లో పెద్ద షాక్.. ఈరోజు రేటు ఎంత పెరిగిందో చూడండి

“మీ అంతర్గత విభేదాలు ఇప్పుడు మీలో మీరే చర్చలు జరిపే స్థాయికి చేరుకున్నాయా?” అని ప్రశ్నించారు. ట్రంప్ ప్రభుత్వం పాకిస్థాన్ ద్వారా ఇరాన్‌కు 15 సూత్రాల కాల్పుల విరమణ ప్రణాళికను పంపిన కొద్దిసేపటికే జోల్ఫఘారి ఈ ప్రకటన చేశారు. జోల్ఫఘారి మాట్లాడుతూ.. “మొదటి రోజు నుంచీ మా మొదటి మాట, చివరి మాట ఒకటే. ఇకపైనా అవే ఉంటాయి. మా లాంటి వాళ్ళు మీలాంటి వారితో ఎన్నటికీ రాజీపడరు. ఇప్పుడూ కాదు, ఎప్పటికీ” అని తెలిపారు.