Reading Time: < 1 minute

పాలమూరు యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ బి.ఎడ్ పరీక్ష ఫలితాల విడుదల

Caption of Image.

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : పాలమూరు యూనివర్సిటీ పరిపాలన భవనంలో మంగళవారం నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బి.ఎడ్ పరీక్ష ఫలితాలను వైస్ ఛాన్సలర్ జీఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేశ్​ బాబుతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ వివిధ సెమిస్టర్ల ఫలితాల్లో విద్యార్థులు సాధించిన ఉత్తీర్ణత శాతాన్ని ప్రకటించారు. 

మొదటి సెమిస్టర్ (రెగ్యులర్, బ్యాక్‌‌లాగ్) లో 31శాతం, మూడవ సెమిస్టర్ లో 38శాతం, ఐదవ సెమిస్టర్ లో 50శాతం, ఏడవ సెమిస్టర్ లో 72శాతం, ఎనిమిదవ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాల్లో అత్యధికంగా 92శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. 

©️ VIL Media Pvt Ltd.