July 15, 2026

Crime: మత్తుమందు ఇచ్చి మహిళపై డాక్టర్ అఘాయిత్యం..

Crime: మత్తుమందు ఇచ్చి మహిళపై డాక్టర్ అఘాయిత్యం..
Reading Time: < 1 minute
Indore Doctor Shahid Arrested Rape Blackmail

Crime: మధ్యప్రదేశ్ ఇండోర్‌లో దారుణం జరిగింది. వైద్యం కోసం వచ్చిన 30 ఏళ్ల మహిళపై డాక్టర్ అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అశ్లీల ఫోటోలను తీసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. ఆదివారం డాక్టర్‌ను అరెస్ట్ చేసిన తర్వాత కొందరు వ్యక్తులు అతడి ఇంట్లోకి ప్రవేశించి, ధ్వంసం చేసి, ఆపై నిప్పంటించారు.

Read Also: 10th Result: టెన్త్ ఫలితాల్లో అదరగొట్టిన బాలిక.. 600కు గాను 594 మార్కులు

ఈ అత్యాచారంపై బర్గోండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కొన్ని నెలల క్రితం మహిళ కడుపునొప్పితో సయీద్ ఖాన్ క్లినిక్‌కు వెళ్లింది. అక్కడ డాక్టర్ షాహిద్ మహిళకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం చేశాడు. తాను మత్తులో ఉన్న సమయంతో అశ్లీల ఫోటోలు తీసి బెదిరిస్తున్నట్లు మహిళ ఆరోపించింది. దీని తర్వాత ఈ ఫోటోలను చూపిస్తూ.. పాతల్పాని ప్రాంతంలోని రిసార్ట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు చెప్పింది.