
బీహార్ లో మైనర్ గర్ల్ పై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో సంచలనంగా మారింది. 10వ తరగతి విద్యార్థులు ఇద్దరు కోచింగ్ ముగించుకుని వస్తుండగా అడ్డగించిన రౌడీ మూక.. అమ్మాయిపై లైంగిక దాడికి దిగిన విజువల్స్ షాకింగ్ గా మారాయి. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేయడంతో ఈ సంచలన ఘటన వైరల్ అవుతోంది.
బీహార్ లోని జుమాయి సిటీలో.. 2026 సెప్టెంబర్ 19వ తేదీన సాయంత్రం కోచింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఇద్దరు స్టూడెంట్స్ ను రౌడీ మూకలు అడ్డుకున్నాయి. బైక్ పై నుంచి కిందికి దించి అబ్బాయిని నెట్టేసి.. మైనర్ ను చెట్ల వైపు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ మైనర్ స్నేహితుడు అడ్డుకుంటుండటం.. వదిలేయమని ఆ అమ్మాయి వేడుకుంటున్న విజువల్స్ డిస్టర్బింగ్ గా మారాయి.
ఇద్దరు మైనర్లు మద్వా పహాద్ లో కోచింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరుగుప్రయాణమైన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. గుంపులో ఒకడు అబ్బాయి కాలర్ పట్టి దూరంగా నెట్టేసేందుకు ప్రయత్నించాడు. అమ్మాయి సహాయంతో అబ్బాయి వాళ్ల చేతుల్లోనుంచి తప్పించుకుని ఇద్దరూ పరుగుతీయగా.. దుండగులు ఇద్దరిని వెంబడించారు.
ఒకానొక సందర్భంలో గుంపులో ఉన్న మరో వ్యక్తి మైనర్ మెడ పట్టి లాగి, దారుణంగా ఎత్తుకుని రోడ్డుపై నుంచి చెట్లవైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆమె స్నేహితుడు పరుగెత్తి అడ్డుకున్నాడు. ఈ పెనుగులాటలో ఒకడు అమ్మాయి చెస్ట్ పై చేయి వేయడం దారుణమైన విషయం.
ఇద్దరూ కలిసి బైక్ దగ్గరికి పరుగెత్తే వరకు ఈ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు తప్పించుకుని బైక్ పై ఎక్కి పారిపోయే క్రమంలో.. అమ్మాయి చెయ్యి పట్టుకుని వెనక్కు లాగేందుకు ప్రయత్నించారు. అయితే ఈ ఘటనను దుండగుల్లోనే ఒకడు వీడియో తీయడంతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యింది.
Videos reportedly show two teenage school students being harassed in the Jamui-Lakhisarai area of Bihar. In the final part, they were allowed to leave. 🤬💔 pic.twitter.com/j5YVz8ZjZn
— IndianLafda (@IndianLafdaa) September 21, 2026
వదిలేయమని వేడుకున్న మైనర్:
లైంగిక వేధింపులకు పాల్పడిన ముఠా.. క్షమాపణ చెప్పాల్సిందిగా బెదిరించారు. మమ్మల్ని వెళ్లనివ్వండి.. మేము ఈ రూట్ లో మరోసారి రాము.. అంటూ మైనర్ వేడుకుంది. ఆ తర్వాత ఎట్టకేలకు బయటపడ్డారు.
కేసు సుమోటోగా తీసుకున్న పోలీసులు:
సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేయడంతో.. ఇష్యూ చాలా సీరియస్ గా మారింది. దీంతో కేసును సుమోటోగా తీసుకుని విచారిస్తున్నట్లుగా ఎస్పీ తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు.
పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలి: రాహుల్ గాంధీ
బీహార్ లో జరిగిన ఈ ఘటనను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.
జుమాయిలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో డిస్టర్బింగ్ గా ఉంది. ఇద్దరు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ను రోడ్డుపై ఆపేసి.. వేధించడం దారుణం.. లైంగిక దాడికి పాల్పడటం ఘోరం. వదిలేయమని దుండగులను చేతులు జోడించి మైనర్ వేడుకున్నప్పటికీ ఈడ్చుకెళ్లటం, లైంగిక వేధింపులకు పాల్పడటం ఘోరమైన చర్యగా ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యక్తులకు ఇలా ప్రవర్తించే హక్కు ఎవరు ఇచ్చారు? ఇది మన సంస్కృతి కాదు. ఇది పితృస్వామ్య అహంకారం.. ఏ పురుషుడైనా ఒక అమ్మాయి శరీరాన్ని, ఆమె కదలికలను, ఆమె ఇష్టాఇష్టాలను నియంత్రించవచ్చనే నమ్మకంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఆ వీడియోలోని ప్రతి ఒక్కరినీ గుర్తించి, పోక్సో (POCSO) చట్టం కింద విచారించాలి, అని రాహుల్ డిమాండ్ చేశారు.
ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కూడా ఎటువంటి అరెస్టులు చేయకపోవడంపై ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఒకవేళ ఈ ఘటన సెప్టెంబర్ 19న జరిగి ఉంటే, నిందితులు ఇంకా ఎందుకు జైలులో లేరు? సాయంత్రం 7 గంటలకు బహిరంగ ప్రదేశంలో, వాహనాలు తిరుగుతున్న రోడ్డుపై ఒక బాలిక ఎందుకు సురక్షితంగా లేదో బీహార్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి? అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
The video from Jamui, Bihar is deeply disturbing.
Two Class 10 students were stopped on a road. Harassed. Humiliated. Molested. A young girl, hands folded, begged to be let go while goons groped her and dragged her away.
Who gave these men the right to behave like this? This is…
— Rahul Gandhi (@RahulGandhi) September 21, 2026