Reading Time: < 1 minute

హైదరాబాద్ మూసాపేటలో లిఫ్ట్ ప్రమాదం.. లిఫ్ట్కు, గోడకు మధ్య ఇరుక్కుపోయాడు !

Caption of Image.

హైదరాబాద్: మూసాపేట ఆంజనేయనగర్‌లో ఆదివారం ఉదయం లిఫ్ట్ ప్రమాదం జరిగింది. లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్యక్తిని హైడ్రా రెస్క్యూ టీం కాపాడింది. లిఫ్ట్ ప్రమాదంలో.. లిఫ్ట్‌కు, గోడకు మధ్య వేలాడుతున్న స్థితిలో వ్యక్తి కనిపించాడు. మూడో అంతస్తు–రెండో అంతస్తు మధ్య మురళి అనే ఈ బాధితుడు ఇరుక్కున్నాడు. సెన్సార్లు సరిగా పనిచేయకపోవడంతో ప్రమాదం జరిగింది. 

రెండో అంతస్తులో లిఫ్ట్‌ నుంచి బయటకు వస్తుండగా లిఫ్ట్ ఒక్కసారిగా పైకి వెళ్లింది. లిఫ్ట్ గ్రిల్స్‌లో మురళి కాలు ఇరుక్కుపోయింది. లిఫ్ట్‌లోనే ఉన్న భార్య కేకలతో అపార్ట్‌మెంట్ వాసులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

హైడ్రా కంట్రోల్ రూమ్‌కు ఉదయం 9.15 గంటలకు సమాచారం ఇచ్చారు. హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందం 9.30 గంటలకే ఘటనా స్థలికి చేరుకుంది. దాదాపు గంటన్నరపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. లిఫ్ట్ గోడను బద్దలు కొట్టి మురళిని హైడ్రా సిబ్బంది బయటకు తీసింది.

సనత్‌నగర్ ఫైర్ సిబ్బంది హైడ్రాలిక్ కట్టర్‌తో ఈ రెస్క్యూ ఆపరేషన్ చేశారు. ఉదయం 10.50 గంటలకు రెస్క్యూ సిబ్బంది బాధితుడిని సురక్షితంగా బయటకు తీసింది. లిఫ్ట్కు, గోడకు మధ్య నలిగిపోవడంతో మురళి కాలుకు ఫ్రాక్చర్ అయింది. వెంటనే హైడ్రా సిబ్బంది అతనిని సమీప ఆసుపత్రికి తరలించారు.

©️ VIL Media Pvt Ltd.