Reading Time: < 1 minute

హైదరాబాద్ సిటీ: 80 గజాల్లో ఏడంతస్తుల మేడ..హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు

Caption of Image.

హైదరాబాద్ సిటీ, వెలుగు:  హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి  47 ఫిర్యాదులు వచ్చాయి.  హైడ్రా కమిషనర్‌‌‌‌‌‌‌‌  ఏవీ రంగనాథ్‌‌‌‌‌‌‌‌ ప్రజల నుంచి ఫిర్యాదులను  స్వీకరించారు. కేపీహెచ్‌‌‌‌‌‌‌‌బీ కాలనీ ఏడో ఫేజ్‌‌‌‌‌‌‌‌లో 80 గజాల్లో పర్మిషన్​లేకుండా ఏడంతస్తుల భవన నిర్మాణం చేపడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఒకే లే ఔట్‌‌‌‌‌‌‌‌లో ఫేజ్‌‌‌‌‌‌‌‌-1, ఫేజ్‌‌‌‌‌‌‌‌-2 మధ్య గోడలు నిర్మించి రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నారని కోకాపేట లెజండ్‌‌‌‌‌‌‌‌ చైమ్స్‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌-2 వాసులు కంప్లయింట్​చేశారు. అడ్డుగా నిర్మించిన గోడల వద్ద దేవుడి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారని, దీంతో కాలనీ వాసుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని తెలిపారు.

కుత్బుల్లాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం గాజులరామారంలో 167 ఎకరాల్లో ఏర్పడిన మహదేవ్‌‌‌‌‌‌‌‌పురం కాలనీలో 80 వేల గజాల స్థలాన్ని పార్కులు, ఇతర అవసరాల కోసం కేటాయించారని , ప్రస్తుతం చాలా వరకు ఆక్రమణలకు గురవుతున్నాయని, పార్కు స్థలాలను ప్లాట్లుగా మార్చుతున్నారని, దాదాపు సగం వరకు కబ్జాలకు గురైనట్లు ఫిర్యాదు చేవారు. కుత్బుల్లాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం గాజులరామారంలోని పరికిచెరువును అభివృద్ధి చేయాలని మహదేవ్‌‌‌‌‌‌‌‌పురం డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఫోరం కోరింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌ మండలం చింతల్‌‌‌‌‌‌‌‌మెట్‌‌‌‌‌‌‌‌ గ్రామంలోని శ్రీ హస్తాల వీరభద్రస్వామి దేవాలయానికి సంబంధించిన భూములు, పురాతన నీటి గుండం ఆక్రమణలకు గురవుతున్నాయని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.  

సీఎంసీలో అక్రమ నిర్మాణాలపై  ఫిర్యాదులు

సీఎంసీలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటుడటంతో ఫిర్యాదులు కూడా అలాగే వస్తున్నాయి. సీఎంసీ ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి  41 ఫిర్యాదులు రాగా, అందులో  టౌన్ ప్లానింగ్ కి సంబంధించి36 ఫిర్యాదులు ఉన్నాయి.   

©️ VIL Media Pvt Ltd.