
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పార్కిబండ గ్రామంలో సంచలనం సృష్టించిన భర్త హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భర్త మురళిని హత్య చేసిన కేసులో ఆయన భార్య మంచి విజయలక్ష్మి దోషిగా తేలింది. ఈ మేరకు ఆమెకు జీవిత ఖైదుతో పాటు రూ. 6 వేల జరిమానా విధించింది.
2021 సంవత్సరంలో మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హత్య ఘటన చోటుచేసుకుంది. అప్పట్లో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం… భార్య విజయలక్ష్మికి జీవిత ఖైదు మరియు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.