Reading Time: 2 minutes

ఈరోజుల్లో ఎంతోమంది ఈ ప్రాబ్లెమ్ ను ఎదుర్కొన్నవారే ..మధ్యాహ్నం కడుపునిండా భోజనం చేయగానే శరీరం ఒక్కసారిగా రెస్ట్ మోడ్‌లోకి వెళ్లి నిద్ర తన్నుకొస్తుందా? చాలామందిలో ఈ సమస్య సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. వైద్య పరిభాషలో దీనిని ‘పోస్ట్ ప్రాండియల్ సోమ్నోలెన్స్’ అంటారు. అసలు తిన్న వెంటనే నిద్ర రావడానికి వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటో, అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..

రక్త ప్రసరణలో మార్పులు: మనం ఆహారం తిన్న తర్వాత దానిని సరిగ్గా అరిగించడానికి జీర్ణవ్యవస్థకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. ఇక అందువల్ల శరీరంలోని రక్త ప్రసరణ అంతా జీర్ణవ్యవస్థ వైపు ఎక్కువగా మళ్లుతుంది. దీనికారణంగా మెదడుకు వెళ్లే రక్త ప్రసరణ కాస్త తగ్గి, శరీరం అలసటకు గురై నిద్రపోవాలని అనిపిస్తుంది.

Feeling Sleepy Right After Eating? Here’s the Real Reason Behind It
Feeling Sleepy Right After Eating? Here’s the Real Reason Behind It

అధిక కార్బోహైడ్రేట్లు – హార్మోన్ల విడుదల: మధ్యాహ్న భోజనంలో రైస్, మైదా, బంగాళాదుంపలు వంటి అధిక కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇక ఇది శరీరంలో నిద్రకు కారణమయ్యే సెరోటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. దాంతో తిన్న వెంటనే నిద్రమత్తు ఆవరిస్తుంది.

నిద్రమత్తును తగ్గించుకోవడానికి చిట్కాలు: మధ్యాహ్న భోజనంలో కార్బోహైడ్రేట్లను తగ్గించి, ప్రోటీన్లు మరియు పీచు పదార్థాలు (ఫైబర్) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఒకేసారి కడుపు నిండా తినకుండా, కొద్దికొద్దిగా తీసుకోవడం మంచిది. ఇక అలాగే తిన్న వెంటనే ఒకేచోట కూర్చోకుండా కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు తేలికపాటి నడక సాగిస్తే నిద్రమత్తు తగ్గుతుంది.

తిన్న వెంటనే కొద్దిగా నిద్రమత్తు రావడం అనేది శరీరంలో జరిగే ఒక సహజ ప్రక్రియ. అయితే మన ఆహారపు అలవాట్లలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ నిద్రమత్తు నుంచి బయటపడి రోజంతా చురుగ్గా ఉండవచ్చు.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడింది. ఆహారంలో మార్పులు చేసుకున్నా తరచూ తీవ్రమైన నిద్రమత్తు, అలసట వేధిస్తుంటే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయేమో వైద్యులను సంప్రదించి తెలుసుకోవడం మంచిది.

The post తిన్న వెంటనే నిద్ర రావడం సాధారణమేనా? దీని వెనుక అసలు కారణం ఇదే! appeared first on Manalokam – Latest Telugu News & Updates.