Reading Time: < 1 minute

గుడ్ న్యూస్: బంగాళాఖాతంలో వాయుగుండం… ఏపీలో 4 రోజులు భారీ వర్షాలు..

Caption of Image.

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రానున్న నాలుగు ఏరోజుల పాటు భారీ వర్షాలు కురిసే  అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం మంగళవారానికి ( సెప్టెంబర్ 22 ) వాయుగుండంగా బలపడుతుందని..దీంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

విశాఖపట్నం, అల్లూరిసీతారామరాజు, పోలవరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మిగిలిన కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 

ఇక బుధవారానికి ( సెప్టెంబర్ 23 ) వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని.. కృష్ణా, ఎన్టీఆర్, పోలవరం, ఏలూరు, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 24, 25వ తేదీల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. కర్నూలు, నంద్యాల ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ.

భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అల్పపీడనం వాయుగుండంగా మారిన క్రమంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. అలల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని సూచించింది వాతావరణ శాఖ.

©️ VIL Media Pvt Ltd.