
టైటిల్ : తుడక్కమ్
డైరెక్షన్ : ఆంథనీ జోసెఫ్
కాస్ట్ : మోహన్‌లాల్, విస్మయ్ మోహన్‌లాల్, సాయి కుమార్, ఆశిశ్ జో ఆంటోనీ, మనోజ్ కె.
ప్లాట్‌ఫాం : జియోహాట్‌స్టార్
రవి బాలచంద్రన్ (మలయాళ సాయికుమార్) వీల్‌చైర్‌కే పరిమితమైన విలేజ్ ఆఫీసర్. భార్యను కోల్పోయిన ఆయన, కూతురు మీను (విస్మయ మోహన్‌లాల్)ను ఎంతో గారాబంగా పెంచుతాడు. ఊరికి దూరంగా ఉన్న వారి ఇంటికి సమీపంలో జోసెఫ్ మాస్టర్ ఇల్లు మాత్రమే ఉంటుంది. ఆయన రవి కుటుంబానికి అండగా నిలుస్తుంటాడు. అయితే ఆస్తి విషయంలో జోసెఫ్‌కు, అతని ఒంటరి తమ్ముడికి తరచూ గొడవలు జరుగుతుంటాయి. చివరకు ఆ కుటుంబాన్ని అంతమొందించేందుకు అతను పన్నాగం పన్నుతాడు. మరోవైపు ధైర్యసాహసాలు కలిగిన మీను బ్యాంకు పరీక్షకు వెళ్లి తిరిగి రాకపోవడంతో రవి ఆందోళన చెందుతాడు.
ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ కావడం, ఆమెతో వెళ్లిన స్నేహితురాలు ప్రియ కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పరిస్థితి మరింత అనుమానాస్పదంగా మారుతుంది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రవి స్టేషన్‌కు వెళ్లినా పెద్దగా స్పందన ఉండదు. ఇదిలా ఉండగా, బస్‌లో ఒంటరిగా వస్తున్న మీను ఓ కరడుగట్టిన నేరస్థుడితో తలపడుతుంది. అతని బారినుంచి మీను బయటపడుతుందా? ప్రియ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? చివరకు రవి కుటుంబానికి ఎదురైన ప్రమాదం ఏమిటన్నదే మిగతా కథ