Reading Time: < 1 minute
Jiohome Amazon Prime Lite Free For 1 Year Eligible Plans Activation Details Are

Jio-Amazon Prime Lite: జియోహోమ్ కస్టమర్లకు రిలయన్స్ జియో గుడ్‌న్యూస్ చెప్పింది. 10వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఎంపిక చేసిన జియోహోమ్ 3-ఇన్-1 ప్లాన్లపై ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ (Amazon Prime Lite) సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తోంది. 30 Mbps, 100 Mbps స్పీడ్ కలిగిన అర్హత ఉన్న ప్లాన్లను వినియోగిస్తున్న కొత్త, ఇప్పటికే ఉన్న కస్టమర్లు ఈ ఆఫర్ ను పొందవచ్చు.

ఈ ఆఫర్‌లో భాగంగా యూజర్లకు 12 నెలల పాటు “అమెజాన్ ప్రైమ్ లైట్” మెంబర్‌షిప్ కు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా లభిస్తుంది. ఇందులో “ప్రైమ్ వీడియో” యాక్సెస్‌తో పాటు అమెజాన్ లో అర్హత ఉన్న వస్తువుల కొనుగోళ్లపై ఉచితంగా, వేగవంతమైన డెలివరీ సదుపాయం ఉంటుంది. అయితే 12 నెలల మెంబర్‌షిప్ వ్యవధి ఆఫర్‌ను యాక్టివేట్ చేసిన తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

అర్హత ఉన్న అన్ని 30 Mbps, 100 Mbps 3-ఇన్-1 జియో హోమ్ ప్లాన్లకు ఈ కొత్త ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్లలో హోమ్ వై-ఫై, టీవీ, OTT ఎంటర్‌టైన్‌మెంట్ సేవలను ఒకే కనెక్షన్‌లో అందిస్తున్నారు. కొత్తగా “జియో హోమ్” కనెక్షన్ తీసుకునే వారితో పాటు ఇప్పటికే అర్హత ఉన్న ప్లాన్లను వినియోగిస్తున్న కస్టమర్లు కూడా ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.

ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?

అర్హత ఉన్న కస్టమర్లకు “MyJio” యాప్ హోమ్‌పేజీలో ప్రత్యేకమైన క్లెయిమ్ బ్యానర్ కనిపిస్తుంది. ఆ బ్యానర్‌పై క్లిక్ చేసి సూచించిన ప్రకారం ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. యాక్టివేషన్ పూర్తయిన తేదీ నుంచి 12 నెలల పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సభ్యత్వం కొనసాగుతుంది. ఈ ప్రయోజనాన్ని జియో సెప్టెంబర్ 19, 2026 నుంచి దశలవారీగా అందించడం ప్రారంభించింది. అర్హత ఉన్న కస్టమర్లందరికీ రెండు వారాల వ్యవధిలో దశలవారీగా ఆఫర్ అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది.

అయితే రూ.888, రూ.1,199 ప్లాన్లు, అలాగే 150 Mbps లేదా అంతకంటే ఎక్కువ స్పీడ్ ఉన్న జియో హోమ్ ప్లాన్లపై ప్రస్తుతం లభిస్తున్న “అమెజాన్ ప్రైమ్ లైట్” ప్రయోజనంలో ఎలాంటి మార్పు లేదు. ఈ ప్లాన్లను ఉపయోగిస్తున్న కస్టమర్లకు 24 నెలల పాటు మెంబర్‌షిప్ కొనసాగుతుంది.