Reading Time: < 1 minute

Bigg Boss Telugu 10: “గుద్దితే పళ్లు మొత్తం రాలుతాయ్”.. బిగ్ బాస్ 10 నామినేషన్స్‌లో రచ్చ రచ్చ, సుధీర్‌పై సృష్టి ఫైర్!

Caption of Image.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. మూడో వారం నామినేషన్స్ ప్రక్రియలో ఊహించని వివాదాలు, బూతుల వార్, బాహాబాహీ తగాదాలతో హౌస్‌లో వాతావరణం అత్యంత ఉద్రిక్తంగా మారింది. సోమవారం ఎపిసోడ్ లో  బిగ్ బాస్ లవర్స్‌కు మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ స్టఫ్ ఇచ్చింది.   ఈ వారం టెంప్టెషన్ వర్సెస్ టెన్షన్’ (Temptation vs Tension) అన్న థీమ్ తో బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఆట తీరు మరింత రసవత్తరంగా మారింది..

రెండో వారంలో హౌస్‌లో ఎక్కడా కనిపించట్లేదు అంటూ హోస్ట్ నాగార్జున ఇచ్చిపడేసిన క్లాస్‌తో సృష్టి రూటు మార్చినట్లు తెలుస్తోంది . ఈ నామినేషన్స్‌లో తన రుద్రరూపం చూపించింది. సుధీర్ ఫోర్స్డ్ ‘లవ్ ట్రాక్’ సెంటిమెంట్లకు, లీకులకి విసిగిపోయిన సృష్టి అతడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. నువ్వు నా టైప్ కాదని ముందే చెప్పా.. పిచ్చి వేషాలు వేస్తే ఒక్క గుద్దు గుద్దితే పళ్లు రాలిపోతాయి.. నోరు మూసుకో అంటూ సృష్టి ఊగిపోయింది. సుధీర్ చేసే ఊసరవెల్లి రాజకీయాలను ఎండగడుతూ భావోద్వేగానికి గురై షాలిని కౌగిలిలో వెక్కి వెక్కి ఏడ్చేసింది.

మరోవైపు, సుధీర్ సృష్టితో లవ్ ట్రాక్ సెట్ చేసేందుకు త్రిగుణ్ వద్ద సలహాలు తీసుకున్నాడనే టాపిక్ రాగా, సుధీర్ నిందలన్నీ త్రిగుణ్‌పై తోసేయడానికి ట్రై చేశాడు. దీనికి త్రిగుణ్  నిన్ను మానిప్యులేట్ చేయడానికి నువ్వేమైనా చిన్న పిల్లాడివా? నీకు బుర్ర, బుద్ధి లేదా? అని తీవ్రంగా మండిపడ్డాడు. వీరిద్దరి మధ్య గొడవ శృతిమించి ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత వరకు వెళ్లింది. ఇతర హౌస్‌మేట్స్ వచ్చి ఆపాల్సి వచ్చింది.

ఇవే కాకుండా ఫుడ్ విషయంలో వంశీ, వర్షిణి మధ్య ఘాటు వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. నామినేషన్స్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన సుధీర్ ప్రవర్తన అతనికి హెల్ప్ అవుతుందా లేక బయటకు పంపేస్తుందా? సృష్టి ఎమోషనల్ డ్రామా వర్కవుట్ అవుతుందా అనేది ఈరోజు (  సెప్టెంబర్ 21, 2026 ) ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్‌లో తేలనుంది.

 

©️ VIL Media Pvt Ltd.