
Best Selfie Camera Phones: ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు చాలామంది మొదటగా గమనిస్తున్న అంశం ‘సెల్ఫీ కెమెరా’. బ్రాండ్లు కూడా వినియోగదారుల ఆసక్తికి తగ్గట్టే హై-రిజల్యూషన్ ఫ్రంట్ కెమెరాలు, ఆటోఫోకస్, మెరుగైన పోర్ట్రెయిట్ ప్రాసెసింగ్, ఏఐ ఫీచర్లను అందిస్తున్నాయి. రూ. 20,000 బడ్జెట్ నుంచి లక్షన్నర వరకు ఉన్న బెస్ట్ సెల్ఫీ కెమెరా ఫోన్ల వివరాలు ఇక్కడ చూద్దాం.
Vivo X300 Ultra..
ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో వివో విడుదల చేసిన Vivo X300 Ultra కెమెరా ప్రియులకు ఒక అద్భుతమైన ఆప్షన్. ఇందులో 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. వెనుకవైపు OIS సపోర్ట్‌తో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 3.7x ఆప్టికల్ జూమ్ (105x డిజిటల్ జూమ్) ఇచ్చే 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో 8K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ఇది 6.82-అంగుళాల 2K 144Hz AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 ప్రాసెసర్, 100W వైర్డ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6,600mAh బ్యాటరీతో వస్తుంది. 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,59,999 కాగా, ఇది ఎక్లిప్స్ బ్లాక్, విక్టరీ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.
Google Pixel 11 Pro XL..
ఇక ఫోటోగ్రఫీలో తనదైన ముద్ర వేసిన గూగుల్ నుంచి వచ్చిన Google Pixel 11 Pro XL మోడల్‌లో f/2.2 అపెర్చర్‌తో 42 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. వెనుకవైపు OIS LDAF ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 48 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్, 5x ఆప్టికల్ జూమ్ (120x డిజిటల్ జూమ్) అందించే 48 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6.8-అంగుళాల QHD+ 120Hz AMOLED డిస్‌ప్లే, టెన్సార్ G6 చిప్‌సెట్, 30W వైర్డ్, 25W Qi 2.2 పిక్సెల్ స్నాప్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 5,115mAh బ్యాటరీ అమర్చారు. కాన్యన్, ఫాగ్, ఆలివ్, అబ్సిడియన్ రంగుల్లో లభించే ఈ ఫోన్ 12GB + 256GB వేరియంట్ ధర రూ. 1,34,999 కాగా, 16GB + 512GB మోడల్ ధర రూ. 1,49,999గా ఉంది.
Samsung Galaxy S26 Ultra..
శామ్‌సంగ్ కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడల్ Samsung Galaxy S26 Ultra కాస్త భిన్నమైన శైలిని ఎంచుకుంది. ఇది 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేసే 12 మెగాపిక్సెల్ f/2.2 ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. వెనుకవైపు f/1.4 అపెర్చర్, OIS ఉన్న 200 మెగాపిక్సెల్ ప్రైమరీ, 5x ఆప్టికల్ జూమ్‌తో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో, 50 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. వీటి ద్వారా 8K, HDR10+ వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ఈ ఫోన్‌లో 6.9-అంగుళాల డైనమిక్ AMOLED 2X 120Hz డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 ఫర్ గెలాక్సీ ప్రాసెసర్, 16GB వరకు RAM, 1TB వరకు స్టోరేజ్, 60W వైర్డ్, 25W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉన్నాయి. బ్లాక్, బ్లూ, పర్పుల్, వైట్ రంగుల్లో లభించే ఈ ఫోన్ ధర రూ. 1,34,999 నుంచి ప్రారంభమై టాప్ మోడల్ రూ. 1,49,999 వరకు ఉంటుంది.
Vivo V70 FE..
అప్పర్ మిడ్-రేంజ్ విభాగంలో తక్కువ ధరలోనే అద్భుతమైన ఫీచర్లు అందించే ఫోన్ Vivo V70 FE. ఇందులో f/2.2 అపెర్చర్‌తో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. వెనుకవైపు OIS సపోర్ట్‌తో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉన్న 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ కెమెరాతో పాటు ఆరా లైట్ AI మ్యాజిక్ వెదర్, AI ల్యాండ్‌స్కేప్, AI ఫోర్-సీజన్ పోర్ట్రెయిట్, 30x సూపర్‌జూమ్ వంటి ఏఐ ఫీచర్లు ఉన్నాయి. 6.83-అంగుళాల 1.5K 120Hz OLED డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7360-టర్బో ప్రాసెసర్, 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న 7,000mAh బ్యాటరీ దీని ప్రత్యేకతలు. మాన్సూన్ బ్లూ, నార్తర్న్ లైట్స్ పర్పుల్ కలర్స్‌లో లభించే ఈ ఫోన్ ప్రారంభ ధర 8GB + 128GB మోడల్‌కు రూ. 44,999 కాగా, 8GB + 256GB మోడల్ రూ. 49,999 12GB + 256GB వేరియంట్ రూ. 51,999కి లభిస్తున్నాయి.
Motorola Edge 70 Pro..
మీ బడ్జెట్ రూ. 40,000 వరకు ఉంటే Motorola Edge 70 Pro మంచి ఛాయిస్. ఇందులో f/1.9 అపెర్చర్, ఆటోఫోకస్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. వెనుకవైపు OIS ఉన్న 50 మెగాపిక్సెల్ సోనీ LYT-710 ప్రైమరీ కెమెరా, ఆటోఫోకస్‌తో 50 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. వీటితో 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేయవచ్చు. ఈ ఫోన్ 6.8-అంగుళాల సూపర్ HD ఎక్స్‌ట్రీమ్ AMOLED 144Hz డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్‌తో 6,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ప్యాంటోన్ లిల్లీ వైట్, ప్యాంటోన్ టీ, ప్యాంటోన్ టైటాన్ రంగుల్లో దొరికే ఈ ఫోన్ 8GB + 256GB బేస్ వేరియంట్ ధర రూ. 39,999 కాగా, 12GB + 256GB మోడల్ రూ. 42,999కి లభిస్తోంది.
Nothing Phone 3a Pro..
తక్కువ ధరకు మెరుగైన సెల్ఫీ ఫోన్ కోరుకునే వారి కోసం Nothing Phone 3a Pro అందుబాటులో ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. వెనుకవైపు OIS, EIS ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్ (60x డిజిటల్ జూమ్) ఉన్న 50 మెగాపిక్సెల్ సోనీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 6.7-అంగుళాల ఫ్లెక్సిబుల్ AMOLED 120Hz డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్, 50W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. బ్లాక్, గ్రే రంగుల్లో లభించే ఈ ఫోన్ 8GB + 128GB వేరియంట్ రూ. 27,999, 8GB + 256GB వేరియంట్ రూ. 29,999, 12GB + 256GB వేరియంట్ రూ. 34,999 ధరకు అందుబాటులో ఉన్నాయి.
Poco X7 5G..
రూ. 20,000 లోపు బడ్జెట్ ఉన్నవారికి Poco X7 5G ఒక ఉత్తమ ఎంపిక. ఇందులో 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, వెనుకవైపు OIS, EIS ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 8 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ కెమెరా ఉంటాయి. అంతేకాకుండా ఏఐ ఇమేజింగ్, ఎడిటింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. 6.67-అంగుళాల 1.5K కర్వ్‌డ్ AMOLED 120Hz డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆల్ట్రా చిప్‌సెట్, 45W ఛార్జింగ్ ఉన్న 5,500mAh బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ 8GB RAM, 256GB వరకు స్టోరేజ్ వేరియంట్లలో తక్కువ బడ్జెట్‌లోనే మంచి ఫీచర్లను అందిస్తోంది.