
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని నార్కట్ పల్లి మండలం గోపాలయపల్లి దగ్గర న్యూ వివేర దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం ( సెప్టెంబర్ 21 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఆటోను వెనక నుంచి మినీ గూడ్స్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో గాయపడ్డవారిని కామినేని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులు గోపాలయ పల్లి సమీపంలోని గణేష్ ఆనంద్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో పని చేసే కార్మికులుగా గుర్తించారు. క్షతగాత్రులు ఏపీ లింగోటం, పామనగుల్ల గ్రామాలకు చెందిన ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఘటాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మినీ గూడ్స్ వాహనం డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.