
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలోని ప్రతిష్టాత్మక నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్ఈఈఆర్ఐ) వివిధ విభాగాల్లో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 13.
విభాగాల వారీగా ఖాళీలు: టెక్నికల్ అసిస్టెంట్ 1, టెక్నికల్ ఆఫీసర్ 12.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ, బీఈ/ బి.టెక్, ఎంఎస్సీ, ఎంబీఏ పూర్తిచేసి ఉండాలి.
వయసు
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి.
టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 16.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు. జనరల్, ఈడబ్ల్యూబీఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.
లాస్ట్ డేట్: అక్టోబర్ 15.
సెలెక్షన్ ప్రాసెస్: ట్రేడ్ టెస్టు, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.neeri.res.inను సందర్శించండి.