Reading Time: < 1 minute

కాట్టాలన్ ఓటీటీ స్ట్రీమింగ్ డీటేయిల్స్

Caption of Image.

టైటిల్ : కాట్టాలన్
కాస్ట్ : ఆంటోనీ వర్గీస్, కబీర్ దుహన్ సింగ్, సునీల్, జగదీశ్, దుషారా
డైరెక్షన్ : పాల్ జార్జ్
ప్లాట్​ఫాం : ఆహా

అనకొల్లి అటవీ ప్రాంతంలో ఏనుగులు ఎక్కువగా ఉండటంతో, వాటి దంతాలతో అక్రమ వ్యాపారం చేయాలని మారి (సునీల్) ఓ ముఠాను ఏర్పాటుచేసుకుంటాడు. తన వ్యాపారానికి పోలీసులు, అటవీ అధికారుల నుంచి ఎలాంటి అడ్డంకులు రాకుండా భారీగా లంచాలు ఇస్తూ, గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తుంటాడు. అయితే ఎడ్డీ (కబీర్ దుహాన్ సింగ్) మాత్రం మారి వ్యాపారానికి అడ్డుపడుతుంటాడు. ఏనుగుల కారణంగా తండ్రిని కోల్పోయిన కోపంతో పాటు, తన వ్యాపారానికి మారి అడ్డుగా మారాడనే ద్వేషంతో ఎడ్డీ అతనికి బలమైన శత్రువుగా మారతాడు.

రాజకీయ నాయకులు, పోలీసు అధికారులతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని ఎడ్డీ, చురుకైన అనుచరుడైన ఆంటోని (ఆంటోని వర్గీస్)ను మారి గ్యాంగ్‌లోకి పంపిస్తాడు. ఆంటోని రాకతో మారి వ్యాపారం పుంజుకోవడంతో అతన్ని అడ్డుకోవాలని ఎడ్డీ గ్యాంగ్ ప్రయత్నిస్తుంది. మారిలో మానవత్వం లేదని గ్రహించిన ఆంటోని, అతనినుంచి విడిపోయి తన బృందానికి తానే నాయకుడిగా నిలవాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న మారి ఏం చేశాడు? ఆంటోనికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అనేది మిగతా కథ.

©️ VIL Media Pvt Ltd.