
ప్రస్తుతం ఓటీటీని ఊపేస్తున్న ఈ చిన్న సినిమా గురించి మీకు తెలుసా.. ? ఈ చిత్రాన్ని తమిళ్ స్టార్ హీరో ధనుష్ ప్రశంసిస్తూ ట్వీట్ కూడా చేశారు. “మీ కుటుంబంతో కలిసి ఈ సినిమాను థియేటర్లలో చూడటం అస్సలు మిస్ అవ్వకండి.” అంటూ రాసుకొచ్చారు ధనుష్. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు మోద రాత్రి. తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న రాజా కరుప్పస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మోద రాత్రి’ చిత్రంలో రిషికాంత్ కథానాయకుడిగా నటించారు. అనిష్మా ఈ చిత్రంలో కథానాయికగా నటించారు. ఈ చిత్రానికి భరత్ శంకర్ సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా లవ్ స్టోరీ.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. తెలుగులో పెద్ద డిజాస్టర్..
ఆగస్ట్ 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక పెళ్లి అమ్మాయి, అబ్బాయి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది అనేది సినిమా. రూ. 3 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రూ. 10 కోట్ల వరకు వసూలు చేసి సంచలనంగా మారింది. అయితే కొత్త సినిమాలు విడుదలవుతున్నప్పటికీ ఈ మూవీ క్రేజ్ మాత్రం తగ్గలేదు.
ఎక్కువ మంది చదివినవి : Folk Song: అబ్బబ్బ ఏమున్నది పాట.. డీజేలో మోత మోగిపోతుందిగా.. వింటే స్టెప్పేయాల్సిందే..
సెప్టెంబర్ 18న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ప్రతి అమ్మాయి మనసులో మిగిలిపోయిన ఆశలు, ప్రేమను కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న యువతికి అండగా నిలబడిన రిషికాంత్ పాత్రలు జనాలను ఆకట్టుకుంటున్నాయి. కార్తీక్ సుబ్బరాజ్, సింబు తదితరులు ఈ చిత్రాన్ని ప్రశంసించారు.
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..
ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..