Reading Time: < 1 minute

ఫ్లై ఓవర్ పై నుంచి.. ఎగిరి కిందపడ్డ BMW కారు.. ముగ్గురు యువకులు మృతి

Caption of Image.

ముంబైలో  ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని కోస్టల్ ఫ్లై ఓవర్ పై నుంచి  BMW కారు కింద పడిపోడింది. ఈ ఘటనలో కారులో ఉన్న  ముగ్గురు మృతి చెందగా మరో  వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న నలుగురినీ సమీపంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని నాయర్ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుల్లో 21 ఏళ్ల షనాయ్ గజ్జాల్‌ తో పాటు 17 ఏళ్ల బాలుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో మృతుడు సుమారు 25 ఏళ్ల వయసున్న వ్యక్తిగా భావిస్తున్నప్పటికీ అతడి గురించి వివరాలు  ఇంకా తెలియాల్సి ఉంది. కారులోని నాలుగో వ్యక్తి సుమారు 20 ఏళ్ల వయసున్న యువకుడిగా అధికారులు తెలిపారు. అతడికి తీవ్ర గాయాలు కావడంతో నాయర్ ఆసుపత్రి ట్రామా వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

 సీసీటీవీలో రికార్డ్

 BMW కారు మెరైన్ డ్రైవ్ నుంచి హాజీ అలీ వైపు వెళ్తోంది. ఆదివారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోవడంతో వంతెనపై నుంచి కారు కిందకు పడిపోయింది. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీలో రికార్డ్ అయింది.  ఉదయం 5:03 గంటలకు BMW కారు ఎలివేటెడ్ కోస్టల్ రోడ్ వంతెనపై నుంచి గాల్లోకి ఎగిరి.. కింద నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో  కింద పడిపోయినట్లు కనిపిస్తోంది . ప్రమాదంపై ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

©️ VIL Media Pvt Ltd.