
గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. శనివారం రాత్రి జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ గేట్ ను రైతులు బలవంతంగా తెరిచి పంట కాలువకు నీటిని విడుదల చేసుకోవడంతో పోలీసులు, ఇరిగేషన్ ఆఫీసర్లు అప్రమత్తమయ్యారు.
వెంటనే తెరిచిన గేట్లను మూసి వేశారు. ఆదివారం కూడా గేట్లను తెరిచి నీటిని విడుదల చేసుకుంటారనే సమాచారంతో జూరాల ప్రాజెక్టు ఎడమ, కుడి కాలువల గేట్ల దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి పంట పొలాలను కాపాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
శనివారం ఆందోళనలు చేపట్టిన రైతులు, ఆదివారం నీటిని విడుదల చేయాలని పట్టుబడుతున్నారు. ఇదిలాఉంటే పంటలకు సాగునీరు ఇచ్చేందుకు సరిపడా జూరాల ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో నీటి విడుదలపై ఆఫీసర్లు తర్జనభర్జన పడుతున్నారు.