
ఏపీలో డీఎస్సీ నియామకాలపై జరుగుతున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. డీఎస్సీలో అవకతవకలపై సీబీఐ విచారణ డిమాండ్ చేస్తూ వైసీపీ వరుస నిరసన కార్యక్రమాలు చేస్తుండగా.. కౌంటర్ ఎటాక్ చేస్తోంది కూటమి. సోమవారం ( సెప్టెంబర్ 21 ) కుప్పంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ వైసీపీని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
వైసీపీ హయాంలో కూడా క్రీడలు నిర్వహించారని..అప్పట్లో ఇచ్చిన సర్టిఫికెట్లు కూడా ఫేక్ అంటున్నారని అన్నారు చంద్రబాబు. గొడ్డలి పార్టీ అధినేత ఫేక్ అని అందర్నీ ఫేక్ అనడం ఇదెక్కడి న్యాయం అని ఎద్దేవా చేశారు చంద్రబాబు. విజయవాడలో గురువులపై గొడ్డలిపార్టీ రౌడీలు దాడి చేశారని అన్నారు.
ఆర్మీలో పనిచేసిన సైనికుడికి కుప్పంలో ఉద్యోగం వస్తే… స్కూలు నుంచి బయటకు పిలిచి సాక్షి రిపోర్టర్ అవమానించారని అన్నారు సీఎం చంద్రబాబు. డీఎస్సీపై వైసీపీ, టీడీపీ పోటాపోటీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన క్రమంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.