
Vivo X500: వివో (vivo) కొత్త ప్రొడక్ట్ లాంచ్ ఈవెంట్‌లో వివో X500 (vivo X500) స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్‌తో పాటు పలు స్మార్ట్ డివైజ్‌లను కూడా కంపెనీ లాంచ్ చేసింది. సాధారణ రిటైల్ ప్యాకేజీతో పాటు ప్రత్యేకమైన “సన్నీ డే” కో-బ్రాండెడ్ ఎడిషన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ప్రత్యేక లిక్విడ్ UI థీమ్, సినిమాటిక్ కలర్ ప్రొఫైల్స్, ఆల్బమ్ బ్యాక్‌గ్రౌండ్ ఆడియో వంటి సాఫ్ట్‌వేర్ ఫీచర్లు ఉన్నాయి.
144Hz డిస్‌ప్లే
vivo X500లో 6.59 అంగుళాల 1.5K LTPS AMOLED ఫ్లాట్ డిస్‌ప్లేను అందించారు. ఇది 2750×1260 పిక్సెల్స్ రిజల్యూషన్, HDR10+ సపోర్ట్‌తో వస్తుంది. 30Hz నుంచి 144Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. గరిష్ఠంగా 4,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. పనితీరు కోసం ఇందులో అధునాతన 3nm ప్రాసెస్‌పై తయారైన MediaTek Dimensity 9600M ప్రాసెసర్, ARM G1-Ultra GPUను ఉపయోగించారు. 12GB LPDDR5X అల్ట్రా ర్యామ్ తో పాటు 256GB, 512GB, 1TB UFS 4.1 స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.
కెమెరా విభాగం
vivo X500లో ఇప్పటివరకు X సిరీస్‌లో ఉపయోగించిన అతిపెద్ద ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను అందించారు. ఇందులో 1/1.28 అంగుళాల సోనీ LYTIA-828 సెన్సార్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా ఉంది. ఇది జెయిస్ గింబల్ లెవల్ స్టెబిలైజేషన్‌కు CIPA 5.5 రేటింగ్‌తో వస్తుంది. దీంతో పాటు 50MP సోనీ LYTIA-610 పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాను అందించారు. ఈ కెమెరాకు కూడా CIPA 5.5 స్థాయి స్టెబిలైజేషన్ ఉంది. 3.1x ఆప్టికల్ జూమ్‌తో పాటు టెలిఫొటో మాక్రోకు సపోర్ట్ చేస్తుంది. 4K వీడియోను 120fps వద్ద రికార్డ్ చేయవచ్చు. “లిప్ స్టిక్ 200” టెలికన్వర్టర్ యాక్సెసరీకి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.
8K లైవ్ వీడియోకు సపోర్ట్
ఈ కొత్త మొబైల్ వీడియో ఫీచర్లకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. స్థానికంగా 8K Live ఫీచర్‌ను అందిస్తున్న తొలి కమర్షియల్ స్మార్ట్‌ఫోన్‌గా కంపెనీ దీనిని పేర్కొంది. Weibo వంటి ప్లాట్‌ఫామ్‌లతో కలిసి దీన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపింది. అలాగే 4K సినీమాటిక్ లైవ్ వీడియోకు కూడా సపోర్ట్ ఉంది. ఇందులో మూవీ-స్టైల్ కలర్ గ్రేడింగ్‌ను కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
7,500mAh బ్యాటరీ & 90W ఫాస్ట్ ఛార్జింగ్
పెద్ద బ్యాటరీని కోరుకునే వినియోగదారుల కోసం ఇందులో 7,500mAh బ్యాటరీని అందించారు. ఇది 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
IP69 రేటింగ్
డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం vivo X500కు IP68తో పాటు IP69 రేటింగ్ ఇచ్చారు. బయోమెట్రిక్ సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, Hi-Fi ఆడియో, NFC వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
vivo X500 ఆండ్రాయిడ్ 17 ఆధారిత OriginOS 7తో వస్తుంది. ఇందులో కొత్త “లిక్విడ్” డిజైన్ సిస్టమ్, ఎలాస్టిక్ టచ్‌స్క్రీన్ అన్‌లాక్ యానిమేషన్లు, ఆటోమేటిక్ ఫొటో సింక్రనైజేషన్ ఎఫెక్ట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సాధారణ వినియోగంలో 72 నెలల వరకు స్థిరమైన పనితీరును అందించేలా ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించినట్లు వివో తెలిపింది.
ధర ఎంతంటే?
చైనాలో ఈ మొబైల్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 24 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఎర్త్ ఎకో, సన్నీ డే, డాన్, నైట్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు ఇలా ఉన్నాయి.
* 12GB + 256GB: 5,499 యువాన్ (సుమారు రూ.78,665).
* 12GB + 512GB: 5,999 యువాన్ (సుమారు రూ.85,820).
* 12GB + 1TB: 6,999 యువాన్ (సుమారు రూ.1,00,125).