Reading Time: < 1 minute

రష్మిక మందన్న ‘మైసా’ టీజర్ రివ్యూ.. బలమైన కథ.. మెడలు విరిచేసేంత పగ !

Caption of Image.

రష్మిక మందన్న ఫిమేల్ లీడ్‌‌‌‌గా నటిస్తున్న చిత్రం ‘మైసా’ సినిమా టీజర్ విడుదలైంది. నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతున్న ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. రక్తసిక్తంగా, హింసాత్మకంగా అనిపించినా దర్శకుడు బలమైన కథను చెప్పబోతున్నాడని.. రష్మికతో చెప్పించబోతున్నాడని టీజర్ చూశాక స్పష్టమైంది.

డైరెక్టర్ హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పుల్లె ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాను అజయ్, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప నిర్మిస్తున్నారు. టీజర్ చూశాక.. బలమైన కథతో పాటు బలమైన సంభాషణలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయని తెలిసింది.

గోండ్ తెగల బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో హై-ఆక్టేన్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా ఈ సినిమా తెరకెక్కింది. రష్మికను ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఇంటెన్స్ అవతార్‌‌‌‌‌‌‌‌లో చూస్తామని టీజర్తో ఖాయమైపోయింది. అయితే.. టీజర్లో ఉన్నంత హింస సినిమాలో ఉంటుందో లేక సెన్సార్ బోర్డ్ కత్తెరకు పని చెబుతుందో చూడాల్సి ఉంది. తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా మైసా విడుదల కానుంది. థియేటర్లలో ఆడిన తర్వాత నెట్ ఫ్లిక్స్ వేదికగా మైసా ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది.

►ALSO READ | నైజాంలో ఓపెన్ అయిన ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్.. మార్నింగ్ షో ఎన్ని గంటలకు ఉందంటే..

©️ VIL Media Pvt Ltd.