
మారుతున్న కాలంతో పాటు మనుషుల మధ్య అనుబంధాలు, దంపతుల రిలేషన్‌షిప్‌లు ఎంత దారుణంగా దెబ్బతింటున్నాయో చెబుతూ సౌత్ స్టార్ హీరోయిన్ ‘చందమామ’ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. నేటి సమాజంలో పెరిగిపోతున్న విడాకుల కేసులకు అసలైన కారణాలను విశ్లేషిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మారుతున్న కాలంతో పాటు మనుషుల మధ్య అనుబంధాలు, దంపతుల రిలేషన్‌షిప్‌లు చాలా దారుణంగా దెబ్బతింటున్నాయని సౌత్ స్టార్ హీరోయిన్ ‘చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లేటెస్ట్ గా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. నేటి సమాజంలో పెరిగిపోతున్న విడాకుల కేసులకు అసలైన కారణాలను విశ్లేషిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాజల్ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
దంపతుల మధ్య దూరాలు పెరగడానికి ‘మితిమీరిన సోషల్ మీడియా వ్యామోహం, మనుషుల్లో నశించే అసహనం’ ప్రధాన కారణాలు అని కాజల్ అభిప్రాయపడ్డారు.. ఒకప్పుడు కష్టసుఖాలు చెప్పుకోవడానికి సమయం కేటాయించేవారు. కానీ ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నా, హ్యాపీగా మాట్లాడుకోకుండా స్మార్ట్‌ఫోన్లలో రీల్స్ స్క్రోలింగ్ చేయడంలోనే మునిగిపోతున్నారు. రెస్టరెంట్లు, డిన్నర్ డేట్‌లకు వెళ్లినా ఇదే సీన్ రిపీట్ అవుతోంది ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రత్యక్ష సంభాషణలు (Direct Communication) తగ్గిపోవడం వల్లే బంధాలు పేకమేడల్లా కూలిపోతున్నాయి అని స్పష్టం చేశారు.
నేను, నా భర్త గౌతమ్ కిచ్లూ కలిసి గడిపే ఖాళీ సమయాన్ని చాలా గౌరవిస్తామని తన వ్యక్తిగత జీవితం గురించి కాజల్ పంచుకున్నారు. ప్రతివారం క్రమం తప్పకుండా డిన్నర్ డేట్‌కి వెళ్తాం. ఆ టైమ్‌లో ఫోన్ పక్కన పెట్టి, ప్రశాంతంగా మాట్లాడుకుంటాం అని తమ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సీక్రెట్‌ను వెల్లడించారు .
ఏడేళ్ల గాఢమైన స్నేహం తర్వాత.. 2020 లాక్‌డౌన్ టైమ్‌లో గౌతమ్ కిచ్లూ, కాజల్ జంట పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరికి ‘నీల్ కిచ్లూ’ అనే కుమారుడు ఉన్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. కాజల్ నటించిన ‘ది ఇండియా స్టోరీ’ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియోహాట్‌స్టార్’లో సక్సెస్ ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. సోషల్ మీడియా మాయలో పడకుండా లైఫ్ పార్ట్‌నర్‌కు టైమ్ ఇవ్వాలని కాజల్ ఇచ్చిన మెసేజ్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది.