
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) అత్యున్నత స్థాయి సమావేశాల్లో పాల్గొనేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ త్వరలో న్యూయార్క్‌కు వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, టెహ్రాన్ ముఖ్య ప్రతినిధి బృందానికి అమెరికా ప్రభుత్వం ఇప్పటికే వీసాలు మంజూరు చేసింది. సెప్టెంబర్ 22 నుంచి 29 వరకు న్యూయార్క్‌లో యూఎన్‌జీఏ హై-లెవల్ వీక్ జరగనుండగా, సెప్టెంబర్ 22నే జనరల్ డిబేట్ ప్రారంభం కానుంది.
గత కొన్ని రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటుండటంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పెజెష్కియాన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల అధ్యక్షులు సమావేశమైతే, యుద్ధం ప్రారంభమైన తర్వాత వీరు మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి కానుంది.