Reading Time: 2 minutes

జపాన్‌ను వణికిస్తున్న దుజువాన్ తుఫాన్: ఆసియా గేమ్స్‌కు బ్రేక్.. భారత్ vs జపాన్ మ్యాచ్‌కి వర్షం ముప్పు!

Caption of Image.

India vs Japan: జపాన్ తూర్పు ప్రాంతాన్ని దుజువాన్ (Typhoon Dujuan) తుఫాన్ తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. గంటకు 144 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులు, కొండపోత వర్షాల కారణంగా రాజధాని టోక్యోతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ తుఫాన్ ధాటికి ఆసియా గేమ్స్ ఈవెంట్లతో పాటు ప్రపంచ ప్రసిద్ధ టోక్యో గేమ్ షో కూడా రద్దయింది.

ఆసియా గేమ్స్ ఈవెంట్స్ వాయిదా: 

* ఆసియా గేమ్స్ వాయిదా: ముందుజాగ్రత్త చర్యగా ఆసియా గేమ్స్‌లోని ఈక్వెస్ట్రియన్ (గుర్రపు స్వారీ) పోటీలను సోమవారం నుంచి మంగళవారానికి నిర్వాహకులు వాయిదా వేశారు.

* భారీ వర్షపాతం: సెప్టెంబర్ 19 (శనివారం) నుంచి ఇజు దీవులు, చిబా ప్రిఫెక్చర్‌తో పాటు పసిఫిక్ తీర ప్రాంతాల్లో ఏకంగా 300 మిమీ (12 అంగుళాలు) కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.

* భారత్ vs జపాన్ మ్యాచ్‌పై నీలినీడలు: టోక్యో, కాంటో (Kanto) రీజియన్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ (JMA) హెచ్చరించింది. మంగళవారం భారత్, జపాన్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరగాల్సిన సాను ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ఈ కాంటో ప్రాంతంలోనే ఉండటంతో ఈ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. లీనియర్ రైన్ బ్యాండ్స్ ఏర్పడి ఆకస్మిక విపత్తులు సంభవించే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తం చేశారు.

275కు పైగా విమానాలు రద్దు.. టోక్యో గేమ్ షో బంద్: 

* విమానాలు రద్దు: టోక్యో వైపు తుఫాను వేగంగా దూసుకొస్తుండటంతో ఇవాళ (సోమవారం, సెప్టెంబర్ 21) ఒక్కరోజే సుమారు 275 విమానాలు రద్దయ్యాయి. జపాన్ ఎయిర్‌లైన్స్ (JAL) 120 దేశీయ, 15 అంతర్జాతీయ విమానాలను రద్దు చేయగా, ఆల్ నిప్పాన్ ఎయిర్‌వేస్ (ANA) 140 దేశీయ విమానాలను నిలిపివేసింది.

* రైళ్లు నిలిపివేత: టోక్యో, పరిసర ప్రాంతాల్లో పలు రైలు సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

* టోక్యో గేమ్ షో క్లోజ్: ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో గేమ్ ప్రదర్శనలలో ఒకటైన టోక్యో గేమ్ షో గురువారం ప్రారంభం కాగా, తుఫాను తీవ్రత కారణంగా చివరి రోజు ( సోమవారం, సెప్టెంబర్ 21) దీనిని ముందస్తుగానే క్లోజ్ చేసేశారు. 

నిలిచిపోయిన విద్యుత్ సరఫరా: 

సెప్టెంబర్ నెల సగటు వర్షపాతం కంటే రేపటి (సెప్టెంబర్ 22, మంగళవారం) వరకు రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. 

©️ VIL Media Pvt Ltd.