
‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న రెండో సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. సెప్టెంబర్ 24న గురువారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. సెప్టెంబర్ 23న సాయంత్రం 6.30 గంటలకు ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షో ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది.
ఈ ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.500 వరకూ పెంచుకునే అవకాశం ప్రభుత్వం నుంచి లభించింది. డే-1 నుంచి డే-4 వరకూ సింగిల్ స్క్రీన్లలో రూ.225 వరకూ, మల్టీప్లెక్స్ల్లో రూ.390 వరకూ టికెట్ రేట్లు ఉండనున్నాయి. డే5 నుంచి డే-10 వరకూ సింగిల్ స్క్రీన్లలో 200 వరకూ, మల్టీప్లెక్స్ల్లో రూ.340 వరకూ టికెట్ రేట్లను తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ చేసింది.
‘ది ప్యారడైజ్’ చిత్రంలోని ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుందని, నాని జడల్ క్యారెక్టర్‌లో మాస్, యాక్షన్ ఆడియన్స్‌కు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అన్నాడు. నాని హీరోగా నటించిన ఈ పీరియాడిల్ బ్యాక్‌డ్రాప్ మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సెప్టెంబర్ 24న పాన్ ఇండియా వైడ్‌గా సినిమా విడుదలవుతోంది.
►ALSO READ | Dil Raju: గణేశ్ నిమజ్జనంలో దిల్ రాజు మాస్ డ్యాన్స్.. భార్యతో కలిసి క్రేజీ స్టెప్పులు.. వీడియో వైరల్
‘చిన్నప్పుడు మనం ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ చూడకుండా నేరుగా థియేటర్‌కు వెళ్లి సర్‌ప్రైజ్ అయ్యేవాళ్లం. నాకు అలా థియేటర్‌లో డైరెక్ట్‌గా ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయడమే ఇష్టం. అందుకే ట్రైలర్‌ను రిలీజ్ చేయడం లేదు. ఈ సినిమాకి సీక్వెల్ గానీ, ప్రీక్వెల్ గానీ ఏమీ ఉండవు.’ అని శ్రీకాంత్ ఓదెల క్లారిటీగా చెప్పేశాడు.