Reading Time: < 1 minute

తెలంగాణ న్యాయవాదుల గౌరవం, రక్షణకు కృషి చేస్తా : కిరణ్ కుమార్ 

Caption of Image.
  • బీసీఐ మెంబర్​గా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్ 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ న్యాయవాదుల సమస్యలు, హక్కులను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) దృష్టికి తీసుకెళ్లి వారి సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధి, రక్షణ కోసం పాటుపడతానని బీసీఐ మెంబర్, సీనియర్ అడ్వకేట్ కిరణ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర బార్ కౌన్సిళ్లను బలోపేతం చేయడం, జాతీయ స్థాయిలో సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యాలని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్ ఆదివారం ఢిల్లీలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమానికి బీసీఐ చైర్మన్ మన్నన్ కుమార్ మిశ్రా, తెలంగాణకు చెందిన బీసీఐ మాజీ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. సిద్దిపేటకు చెందిన కిరణ్ కుమార్ గత 25 ఏండ్లకు పైగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నాంపల్లిలోని మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియేషన్ (ఎంసీసీబీఏ) జనరల్ సెక్రటరీగా, అధ్యక్షుడిగా సేవలందించిన ఆయన.. న్యాయవాదుల సంక్షేమం, మౌలిక వసతుల కల్పనకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులకు, తోటి న్యాయవాదులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.