కావాల్సిన పదార్థాలు: అరకిలో చికెన్ , 15 పచ్చిమిర్చి, రెండు ఉల్లిపాయలు, ఇంకా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, 10 కరివేపాకు ఆకులు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.
పచ్చిమిర్చి చికెన్ తయారీ విధానం: ముందుగా మీరు చికెన్ తీసుకుని దానిని కడిగి కొంచం పసుపు, ఇంకా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ఇలా అన్ని కలిపి కనీసం మీరు 30 నిమిషాల పాటు దీనిని మ్యారినేట్ చేయాలి. అలాగే, మీరు పచ్చిమిర్చిని తీసుకుని చీల్చి పక్కన పెట్టాలి.
పచ్చిమిర్చి చికెన్ తయారీ విధానం స్టెప్ 1 : పాన్ లో ఆయిల్ వేసి వేడి అయినా తరవాత దీనిలో 10 కరివేపాకు, 15 పచ్చిమిర్చి వేసి రంగు మారే వరకు దీనిని వేయించాలి. ఇంకా దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు దీనిలో వేసి గోల్డ్ కలర్లోకి మారే వరకు దీనిని వేయించాలి.
పచ్చిమిర్చి చికెన్ తయారీ విధానం స్టెప్ 3 : ఆ తరవాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు దీనిని కలిసే వరకు కలపాలి.
కొద్దీ సేపటి తరవాత దీనిలో మ్యారినేట్ చేసిన చికెన్ వేసి 10 నిమిషాల పాటు దీనిని వేయించాలి. ఇంకా దీనిలో కొద్దిగా కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి కలపాలి.
పచ్చిమిర్చి చికెన్ తయారీ విధానం స్టెప్ 4 : మీరు దీని మీద మూత పెట్టి సన్నని మంట మీద దీనిని ఉంచితే ఈ చికెన్ మెత్తగా అవుతుంది ఇంకా మంచిగా ఉడికించాలి. ఉడికిన తరవాత దీనిలో నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర 4 నిమిషాలు కూడా దీనిలో కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే వేడి వేడి పచ్చిమిర్చి చికెన్ రెడీ




