మేష రాశి: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ధనానికి లోటుండని జీవితం ఏర్పడుతుంది. సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. భోగభాగ్యాల్లో జీవిస్తారు. విలాస జీవితానికి అలవాటుపడతారు. విహార యాత్రలు ఎక్కువగా చేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఆశించిన శుభ కార్యాలు జరుగుతాయి. దాంపత్య జీవితం మరింత హ్యాపీగా సాగిపోతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరే అవకాశముంది.
మిథున రాశి: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్రుడి సుదీర్ఘ సంచారం వల్ల విలాస జీవితం మీద వ్యామోహం బాగా పెరుగుతుంది. ధన స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఆదాయం అంచనాలను మించి వృద్ధి చెందుతుంది. ఫలితంగా జీవనశైలి మారిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పట్ట పగ్గాలుండవు. పట్టిందల్లా బంగారం అవుతుంది. సిరిసంపదలతో పాటు భోగ భాగ్యాలు వృద్ధి చెందుతాయి. ఉన్నత వర్గాల్లో చేరిపోయే సూచనలున్నాయి. విదేశీ ప్రయాణాలు పెరుగుతాయి.
కర్కాటక రాశి: ఈ రాశిలో గురువు ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తుండడం, చతుర్థ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆదాయంతో పాటు విలాసాలను అనుభవించడం, విలాస వస్తువులు కొనడం ఎక్కువవుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతాయి. ఉన్నత వర్గాలతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.
కన్య రాశి: ఈ రాశికి ధన స్థానంలో శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్ప డుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభ త్యాల పెరుగుదలకు అవకాశముంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు రెట్టింపవుతాయి. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశీ ఆఫర్లు లభిస్తాయి. ఫలితంగా విందు, విలాసాలు బాగా విస్తరిస్తాయి.
తులా రాశి: ఈ రాశిలో రాశ్యధిపతి శుక్రుడి సంచారం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం కూడా ఉంది. లక్ష్మీ కటాక్షం బాగా ఎక్కువగా ఉన్నందువల్ల భోగభాగ్యాలకు, విలాస జీవితానికి, సుఖ సంతోషాలకు లోటుండదు. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. విదేశీయానానికి సంబంధించిన ఆటంకాలన్నీ తొలగిపోతాయి. నిరుద్యోగులకు ఆశించిన దాని కంటే మంచి ఉద్యోగం లభిస్తుంది.
ధనుస్సు రాశి: రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడంతో పాటు, లాభాధిపతి శుక్రుడు లాభ స్థానంలోనే సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి అనేక వైపుల నుంచి ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. ఫలితంగా జీవితం పూర్తిగా మారిపోతుంది. ఏ రంగంలో ఉన్నా వీరి ప్రాభవం బాగా పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం నిశ్చయం కావడం లేదా సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. విలాస జీవితాన్ని అనుభవించడంలో కొత్త పుంతలు తొక్కుతారు.





