
ఘట్కేసర్: కుటుంబ కలహాలతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది. పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలో సంస్కృతి టౌన్‌షిప్ గెలాక్సీ టవర్స్‌లోని విశ్వ ఈ -బ్లాక్ 202 ఫ్లాట్‌లో విశాఖపట్నం జిల్లాకు చెందిన రమాకాంత్, మౌనిక(26) దంపతులు మూడేళ్ల కవల పిల్లలతో ఉంటున్నారు.
ఇద్దరూ పోచారంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేస్తున్నారు. శనివారం రాత్రి గెలాక్సీ టవర్స్‌లో నిర్వహించిన గణేశ్ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివారం తెల్లవారుజామున భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కాసేపటికే మౌనిక గదిలోకి వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత పనిమనిషి ఆ గదిలోకి వెళ్లి చూడగా మౌనిక విగతజీవిగా కనిపించింది. ఆమెకు ఉన్న గాయాలను బట్టి ఉరేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.