Reading Time: < 1 minute

బొల్లారం ఆర్మీ వెపన్స్ మిస్సింగ్ కేసు.. నిందితుడు మల్లేష్ కు 10 రోజుల కస్టడీ

Caption of Image.

 సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఆర్మీ ఉద్యోగి మల్లేష్‌ను మరింత లోతుగా విచారించేందుకు కోర్టు పోలీసులకు అనుమతినిచ్చింది.   

నిందితుడు మల్లేష్‌ను ఏకంగా 10 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ స్థానిక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపధ్యంలో రేపటి నుంచే మల్లేష్‌ను తమ  కస్టడీకి తీసుకుని విచారించడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. 

 రిమాండ్‌లో భాగంగా చంచల్గూడ జైలుకు తరలించిన సమయంలో మల్లేష్ తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. లివర్, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అతనికి ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యం అందించారు. మెరుగైన చికిత్స అనంతరం కోలుకున్న మల్లేష్.. శుక్రవారం పూర్తిగా డిశ్చార్జ్ అయ్యారు.  

ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్న మల్లేష్‌ను.. కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయుధాలు ఎక్కడెక్కడ దాచాడు? ఈ చోరీ వెనుక అసలు ఉద్దేశం ఏంటి? మరెవరి ప్రమేయమైనా ఉందా? అనే కోణాలపై పోలీసులు ఈ 10 రోజుల కస్టడీలో కూపీ లాగనున్నారు. ఈ విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది

 

 

©️ VIL Media Pvt Ltd.