Reading Time: < 1 minute

నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోరం.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుని.. యజమాని, ఇద్దరు కొడుకులపై హత్యాయత్నం

Caption of Image.

నాగర్ కర్నూల్ జిల్లాలో హత్యాయత్నం కలకలం రేపింది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకోవడమే కాకుండా యజమాని, ఇద్దరు కొడుకులపై హత్యాయత్నానికి పాల్పడ్డ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటం ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే బల్మూర్ మండలం మహదేవ్ పూర్ గ్రామానికి చెందిన మేడిపూరి కిష్టమ్మ అనే మహిళ ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకుంటున్నారు.

2026 సెప్టెంబర్ 19 (శనివారం) నిర్మాణ పనులు జరుగుతుండగా భూ విభేదాల కక్ష్యలతో ఇంటి పనులు ఆపాల్సిందిగా వారి పాలి భాగస్తులైన మేడిపూరి నర్సింహా, గంధం శ్రీకాంత్ (చౌటపల్లి ), మేడిపూరి రమేష్, మేడిపూరి పార్వతమ్మ, మేడిపూరి చాందిని, మేడిపూరి అజయ్ కుమార్, మేడిపూరి రేణుకలు గొడవకు దిగారు.

ఇంటి మీదికి వచ్చి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో కిష్టమ్మ చిన్నకొడుకు మేడిపూరి సుదర్శన్ (36) తప్పించుకోగా.. పెద్దకొడుకు మేడిపూరి రాజేశ్వర్ (41) తీవ్రంగా గాయపడ్డారు. తలపై తీవ్రంగా గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ ఘటనపై బల్మూర్ పోలీసులు BNS: 109 సెక్షన్ కింద అటెంప్ట్ టూ మర్డర్ కేసు  నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

©️ VIL Media Pvt Ltd.