
తెలంగాణలో నాని లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. నైజాంలో ‘మైత్రీ మూవీ మేకర్స్’ ఈ సినిమాను విడుదల చేస్తుంది. ‘బుక్ మై షో’లో కాకుండా డిస్ట్రిక్ట్ యాప్లో ఎక్స్ క్లూజివ్గా టికెట్లను అందుబాటులో ఉంచారు. మైత్రీ థియేటర్లతో పాటు మరికొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లను డిస్ట్రిక్ట్ యాప్లో ఉంచారు. 50 రూపాయల టికెట్ వంద రూపాయలు, వంద రూపాయల టికెట్ 150 రూపాయలు, బాల్కనీ టికెట్ను 200 రూపాయలకు అమ్ముతున్నారు.
జీఎస్టీ, ఇతర వడ్డింపులు అదనం. మార్నింగ్ షో ఉదయం 8 గంటలకు ఉంది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 24న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది. ఇదొక తల్లీకొడుకుల కథ. ఒక సవారీ జాతి కథ. ప్రతి ఒక్కరికీ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.
‘‘చరిత్రలో అందరూ చిలుకలు, పావురాల గురించి రాసిర్రు గానీ గదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానా కెళ్ళి నడిచే శవాల కథ. అమ్మరొమ్ములో పాలు లేక రక్తం బోసి పెంచిన ఒక జాతి కథ. ఒక దగడ్ వొచ్చి మొత్తం జాతిలో జోష్ తెచ్చిండు.
►ALSO READ | తెలంగాణలో నాని ‘ది ప్యారడైజ్’ సినిమా టికెట్ రేట్ల పెంపు.. ప్రీమియర్ షో టికెట్ ఎంతంటే..
థూ.. అనిపించుకున్న కాకులు తల్వార్‌లు పట్టినాయ్. ఇది ఆ కాకులని ఒక్కటి చేసిన తిరుగుబాటుదారుడి కథ.. నా కొడుకు నాయకుడు అయిన కథ’’ అని పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో వచ్చిన గ్లింప్స్, ‘ఆయా షేర్’ సాంగ్, ‘ఏషనాగుల’ సాంగ్, టీజర్.. ఈ నాలుగూ నాని, శ్రీకాంత్ ఓదెల ‘ప్యారడైజ్’ సినిమాకు మంచి బజ్ తెచ్చిపెట్టాయి. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలున్నాయి.