
Oppo A7 Pro Max 5G Global Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో Oppo A7 Pro Max 5G గ్లోబల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఆగస్టులో చైనా దేశీయ మార్కెట్‌లో పరిచయమైన ఈ ఫోన్ ఇప్పుడు థాయ్‌లాండ్, మలేషియా, ఆస్ట్రియా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైంది. ఈ ఫోన్‌లో ముఖ్యంగా 10,000mAh భారీ బ్యాటరీ, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా, IP69K రేటింగ్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.
Oppo A7 Pro Max 5G ధర ఎంత?
గ్లోబల్ మార్కెట్‌లో Oppo A7 Pro Max 5Gను 6GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో కంపెనీ తీసుకొచ్చింది.
మలేషియా: MYR 2,299 (సుమారు రూ.54,000)
ఆస్ట్రియా: €599 (సుమారు రూ.66,000)
థాయ్‌లాండ్: THB 19,999 (సుమారు రూ.57,500)
ఫోన్‌ను Surfing Blue, Lunar Black కలర్ ఆప్షన్లలో విడుదల చేశారు. భారత్‌లో ఈ ఫోన్ ధర, లాంచ్‌పై కంపెనీ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే
Oppo A7 Pro Max 5Gలో 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 2,772 × 1,272 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. దీంతో స్క్రోలింగ్, వీడియోలు, గేమింగ్ సమయంలో స్మూత్ విజువల్ అనుభవాన్ని అందించనుంది.
Snapdragon 4 Gen 5 చిప్‌సెట్
పర్ఫార్మెన్స్ కోసం ఫోన్‌లో Qualcomm Snapdragon 4 Gen 5 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది 4nm ప్రాసెస్‌పై రూపొందించారు. ఫోన్‌లో గరిష్ఠంగా 6GB LPDDR4X RAM, 256GB UFS 3.1 స్టోరేజ్ లభిస్తుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, Oppo A7 Pro Max 5G Android 16 ఆధారిత ColorOS 16తో వస్తుంది.
10,000mAh బ్యాటరీ.. 80W ఛార్జింగ్
ఈ ఫోన్‌లోని అతిపెద్ద ప్రత్యేకత 10,000mAh బ్యాటరీ. భారీ బ్యాటరీ సామర్థ్యంతో ఎక్కువ సమయం ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. ఫోన్‌లో 27W రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. అంటే అవసరమైనప్పుడు Oppo A7 Pro Max 5Gను ఇతర డివైజ్‌లకు పవర్ అందించే పవర్‌బ్యాంక్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు.
50MP కెమెరా సెటప్
ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా అందించారు. దీంతో పాటు మరో కెమెరా కూడా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంటుంది. Oppo A7 Pro Max 5Gలో ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే NFC సపోర్ట్ కూడా లభిస్తుంది. ఫోన్‌కు IP69K రేటింగ్ ఇవ్వడం మరో ప్రత్యేకత. దీని వల్ల దుమ్ము, నీటి నుంచి మెరుగైన రక్షణ లభించనుంది.
మొత్తంగా Oppo A7 Pro Max 5Gలో భారీ 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, AMOLED 120Hz డిస్‌ప్లే, IP69K రక్షణ వంటి ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. భారత్‌లో ఈ ఫోన్ ఎప్పుడు విడుదల అవుతుంది, ధర ఎంత ఉంటుంది అనే వివరాలపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.