Reading Time: < 1 minute

డ్రగ్స్‌‌‌‌ స్మగ్లింగ్‌‌‌‌ బోట్‌‌‌‌పై అమెరికా దాడి.. కరేబియన్‌‌‌‌ సముద్రంలో నలుగురు మృతి

Caption of Image.

వాషింగ్టన్: డ్రగ్స్‌‌‌‌ రవాణా చేస్తున్నారన్న అనుమానంతో కరేబియన్‌‌‌‌ సముద్రంలో ఒక పడవపై అమెరికా దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లు అమెరికా మిలిటరీ తెలిపింది. లాటిన్‌‌‌‌ అమెరికాలోని డ్రగ్‌‌‌‌ స్మగ్లర్లపై ట్రంప్‌‌‌‌ యంత్రాంగం గత ఏడాది నుంచి తీవ్ర దాడులు చేస్తోంది. ట్రంప్‌‌‌‌ సర్కారు ‘నార్కో-టెర్రరిస్టుల’ను టార్గెట్ చేసి ఇప్పటివరకు 69 దాడులు జరిపి 231 మందిని మట్టుబెట్టింది. 

పసిఫిక్ మహాసముద్రం, కరేబియన్‌‌‌‌ సముద్ర మార్గాల్లో నిఘా పెట్టిన యూఎస్ సదరన్ కమాండ్, డ్రగ్స్‌‌‌‌ స్మగ్లింగ్ చేస్తున్న పడవలను లక్ష్యంగా చేసుకున్నామని స్పష్టం చేసింది. అయితే, ఆ పడవలో డ్రగ్స్ ఉన్నట్లు ఎలాంటి ఆధారాలను బయటపెట్టలేదు. మరోవైపు, ఈ డ్రగ్‌‌‌‌ వ్యతిరేక పోరును లాటిన్‌‌‌‌ అమెరికా దేశాల భూభాగాల్లోకి విస్తరించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. కొలంబియా, గ్వాటెమాలా, హోండురాస్ దేశాలు తమ భూ భాగాల్లో అమెరికాతో కలిసి ఉమ్మడి సైనిక చర్యలు చేపట్టేందుకు అంగీకరించాయని యూఎస్ రక్షణ కార్యదర్శి వెల్లడించారు. 
 

©️ VIL Media Pvt Ltd.