Reading Time: 2 minutes
MYSAA Teaser: యాక్షన్‌ సీన్స్‌తో దుమ్మురేపిన రష్మిక మందన్న.. మెంటలెక్కిస్తున్న మైసా టీజర్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనలోని నటనను మరో కోణంలో ఆవిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దాదాపు షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

ఏం పాటరా బాబు..! యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్.. విన్నకొద్దీ వినాలనిపించేలా ఉందిగా

మైసాలో రష్మిక ఇంతకుముందెన్నడూ కనిపించని రీతిలో సరికొత్త అవతారంలో దర్శనమిచ్చారు. గిరిజన గోండు మహిళ పాత్రలో ఆమె పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకునేలా కనిపించారు. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, యాక్షన్ సన్నివేశాల్లోనూ తనదైన శైలిలో మెప్పించనున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. తన తండ్రి కోసం, తన వాళ్ల కోసం పోరాడే మహిళగా రష్మిక పాత్రను తీర్చిదిద్దినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. కష్టకాలంలో తన ప్రజల కోసం ఆమె చేసే పోరాటమే కథలో కీలకాంశంగా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది.

తెలుగు సినిమా దెబ్బకు కన్నీళ్లు పెట్టుకుంటున్న నార్త్ ఆడియన్స్.. ఓటీటీలో దూసుకుపోతున్న మూవీ

టీజర్ ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది. అడవులు, గిరిజన ప్రాంతాల నేపథ్యంలో సాగే కథకు తగ్గట్టుగా విజువల్స్‌ను తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటోంది. రష్మిక పాత్రలోని మాస్ షేడ్స్, యాక్షన్ సీన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఇక టీజర్‌లో జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాక్షన్ సన్నివేశాలకు తగ్గట్టుగా ఆయన అందించిన మ్యూజిక్ టీజర్‌కు మరింత ఇంపాక్ట్ తీసుకొచ్చింది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ కూడా కథకు తగ్గట్టుగా కనిపిస్తున్నాయి. కొత్త తరహా యాక్షన్ థ్రిల్లర్‌గా ‘మైసా’ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ‘మైసా’లో రష్మిక పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. టీజర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రష్మిక కెరీర్‌లో మరో డిఫరెంట్ మూవీగా ‘మైసా’ నిలుస్తుందా? గిరిజన మహిళగా ఆమె పాత్ర ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే నవంబర్ 27 వరకు వేచి చూడాల్సిందే.

చిరంజీవికి జోడిగా అందాల భామ.. మొదటిసారి మెగాస్టార్‌ సరసన సీనియర్ హీరోయిన్



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.