
Andros Townsend Pitch Roller Accident Thai League: పీటీ ప్రచువాప్ (PT Prachuap) ప్రాతినిధ్యం వహిస్తున్న ఆండ్రోస్ టౌన్‌సండ్ (Andros Townsend) పట్టాని (Pattani) జట్టుతో జరిగిన మ్యాచ్‌కు ముందు మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో గాల్లోకి లేచిన బంతిని అద్భుతమైన బ్యాక్‌హీల్ షేప్‌తో గోల్ పోస్ట్ వైపు కొట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఆయన నేలపై పడగా, అప్పటికే కదులుతున్న పిచ్ రోలర్‌ను డ్రైవర్ గమనించకపోవడంతో వాహనం ఆ ఆటగాడి శరీరంపైకి దూసుకెళ్లింది. రోలర్ చక్రాలు ఆయన కాళ్లు, తుంటి భాగం మీద నుంచి వెళ్లడంతో అక్కడివారంతా భయంతో హడలిపోయారు. మైదానంలో ఉన్న తోటి ఆటగాళ్ళు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
అదృష్టవశాత్తూ టౌన్‌సండ్‌కు ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదని సమాచారం అందడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన ఈ విచిత్ర సంఘటనను ఆ ఆటగాడు కూడా తేలికగా తీసుకున్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియోను షేర్ చేస్తూ నవ్వుతున్న ఎమోజీలను జతచేశాడు. అలాగే తన స్టోరీస్‌లో దీనిపై చమత్కారంగా స్పందిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడటమే కాకుండా, మ్యాచ్ చివరి నిమిషంలో సబ్ ఆటగాడిగా బరిలోకి దిగడం విశేషం.
ఈ పోరులో ప్రచువాప్ జట్టు 3 – 0 తేడాతో విజయం సాధించింది. గతంలో టోటెన్‌హామ్ (Tottenham), క్రిస్టల్ ప్యాలస్ (Crystal Palace) క్లబ్‌ల తరపున ఆడిన ఈ ఆటగాడు, ఇంగ్లాండ్ జాతీయ జట్టు (England Football Team) తరపున 13 మ్యాచ్‌లు ఆడాడు. ఆగస్టు నెలలో కంచనబురి పవర్ (Kanchanaburi Power) క్లబ్ నుంచి ప్రచువాప్ జట్టులో చేరిన ఈ వింగర్ తాజా ఘటనతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు.
Andros Townsend just got ran over by a pitch roller in the Thailand league… https://t.co/TZgRGt9rWy
— The 44
(@The_Forty_Four) September 19, 2026
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(@The_Forty_Four)