Reading Time: < 1 minute
హాలీవుడ్ సినిమాలతో పోలికలు అవసరమా..?

ఇండియన్ సినిమాలను హాలీవుడ్ మూవీస్‌తో పోల్చడం అవసరమా..? విజువల్ వండర్స్ అంటూ అంచనాలు పెంచేసి చివరికి అనవసరమైన ట్రోలింగ్ బారిన పడటమెందుకు..? ఇప్పుడేమో ఏకంగా అవతార్‌ను బీట్ చేసి చూపిస్తామంటూ మరో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. నిజంగా ఈ కంపారిజన్స్‌తో పనేంటి..? కంటెంట్ ఉంటే సరిపోతుంది కదా..? ఇది మేకర్స్‌ను ప్రెజర్‌లోకి నెట్టదా..? సాధారణంగా VFX బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాల బజ్ పెంచడానికి మేకర్స్ ఏకంగా హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో పోలుస్తుంటారు. గతంలో దేవర ప్రమోషన్స్‌లో కళ్యాణ్ రామ్ ఏకంగా గేమ్ ఆఫ్ థ్రోన్స్ పేరు వాడేసి విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. తీరా థియేటర్లలో ఆ రేంజ్ గ్రాండియర్ లేకపోవడంతో అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు.. సినిమా ట్రోల్ అయింది. మైథలాజికల్ ప్రాజెక్ట్ రామాయణ విషయంలోనూ సరిగ్గా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. మేకర్స్ తమ సినిమా బడ్జెట్ 4 వేల కోట్లు అంటున్నారు.. కానీ అందులో విజువల్స్ మాత్రం ఆ స్టాండర్డ్స్‌లో లేవు.. హాలీవుడ్ లెవెల్ అంటూ ముందే ఊదరగొట్టడం వల్లే ఆ గ్రాఫిక్స్‌పై సోషల్ మీడియాలో ఈ రేంజ్ ట్రోలింగ్ నడుస్తుంది.. ఆ గొప్పలకు పోయినపుడే ఈ తిప్పలు వస్తున్నాయి. తాజాగా రాకాను సేమ్ డేంజర్ జోన్‌లోకి నెట్టేస్తున్నారు. ఈ సినిమా విజువల్స్ అవతార్‌ను మించిపోతాయని దర్శకుడు సిబి చక్రవర్తి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి భారీ స్టేట్‌మెంట్స్ ఇచ్చినపుడు ఆ రేంజ్ ఔట్‌పుట్ రావాలి.. ఏమాత్రం తేడా కొట్టినా నెగిటివిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ నిజంగా హాలీవుడ్‌ను మించేలా ఉంటే.. అది విడుదలయ్యాక ఆడియన్సే చెప్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నేను స్వతంత్రుడిని.. ఎవరికీ సమాధానం చెప్పను.. ఓపెన్ ఏఐ తిరుగుబాటు

ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్‌.. హ్యాట్సాఫ్‌!

ఏంట్రా ఇది.. అదేమైనా బస్సా.. విమానంలో షర్ట్స్‌ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..

రోబోల చేతికి కత్తెర? బార్బర్‌ ఉద్యోగాలూ గో..వింద!

ఏపీకి మరోసారి తుఫాన్ ముప్పు.. దూసుకొస్తున్న అల్పపీడనం..