
IRCTC Kashmir Tour Package Telugu: కశ్మీర్ అందాలను ఆస్వాదించాలనుకునే హైదరాబాద్ వాసులకు IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. “Mystical Kashmir Ex – Hyderabad” పేరుతో 5 రాత్రులు, 6 రోజుల ఈ ప్యాకేజీలో శ్రీనగర్, సోన్మార్గ్, గుల్మార్గ్, పహల్గామ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది.
హైదరాబాద్ నుంచి కశ్మీర్ టూర్ ప్యాకేజీ
- ప్యాకేజీ కోడ్: SHA11
- ప్రయాణ విధానం: విమానం
- తరగతి: కంఫర్ట్
- ప్రయాణ తేదీలు: 2026 అక్టోబర్ 12, నవంబర్ 21
- మొత్తం సీట్లు: 19
అక్టోబర్ 12న హైదరాబాద్ నుంచి ఉదయం 8:30 గంటలకు విమానం బయలుదేరి, శ్రీనగర్‌కు మధ్యాహ్నం 3:45 గంటలకు చేరుకుంటుంది. అక్టోబర్ 17న సాయంత్రం 4:20 గంటలకు శ్రీనగర్ నుంచి బయలుదేరి రాత్రి 10:05 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. నవంబర్ 26న సాయంత్రం 4:55 గంటలకు బయలుదేరి రాత్రి 8:05 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. విమాన సమయాల్లో మార్పులు ఉండవచ్చని IRCTC పేర్కొంది.
టూర్‌లో ఏం సందర్శిస్తారు?
- మొదటి రోజు శ్రీనగర్ చేరుకున్న తర్వాత హోటల్‌లో చెక్‌ఇన్ చేసి విశ్రాంతి తీసుకుంటారు.
- రెండో రోజు సోన్మార్గ్ పర్యటన ఉంటుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.
- మూడో రోజు గుల్మార్గ్ సందర్శిస్తారు. ఇక్కడ ప్రసిద్ధ గుల్మార్గ్ గోండోలా రైడ్‌ను సొంత ఖర్చుతో చేసుకోవచ్చు.
- నాలుగో రోజు పహల్గామ్ పర్యటనలో సాఫ్రన్ ఫీల్డ్స్, అవంతిపూర్ శిథిలాలను సందర్శిస్తారు. బీటాబ్ వ్యాలీ, చందన్‌వారి, అరూ వ్యాలీ వంటి ప్రాంతాలను స్థానిక రవాణా ద్వారా సొంత ఖర్చుతో చూడవచ్చు.
- ఐదో రోజు శ్రీనగర్‌కు తిరుగు ప్రయాణంలో శంకరాచార్య ఆలయ దర్శనం ఉంటుంది. సాయంత్రం దాల్ లేక్‌లో శికారా రైడ్‌ను ఆస్వాదించవచ్చు.
- చివరి రోజు మొఘల్ గార్డెన్స్, బొటానికల్ గార్డెన్ లేదా షాలిమార్ గార్డెన్స్ సందర్శించి విమానాశ్రయానికి చేరుకుంటారు.
ప్యాకేజీ ధరలు
సింగిల్ ఆక్యుపెన్సీ రూ.44,670, డబుల్ ఆక్యుపెన్సీ రూ.39,070, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.37,510గా ఉన్నాయి. 5–11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ.30,230, బెడ్ లేకుండా రూ.27,870, 2–4 ఏళ్ల పిల్లలకు రూ.27,240గా ధరలు ఉన్నాయి.
ప్యాకేజీలో విమాన టికెట్లు, 5 రాత్రుల హోటల్ వసతి, అల్పాహారం, రాత్రి భోజనం, శికారా రైడ్, ప్రయాణ బీమా, రవాణా, టోల్, పార్కింగ్, పన్నులు, ఎంట్రీ టికెట్లు, టూర్ ఎస్కార్ట్ సేవలు ఉన్నాయి. అయితే గోండోలా రైడ్, లంచ్, వ్యక్తిగత ఖర్చులు, స్థానిక రవాణా వంటి కొన్ని ఖర్చులు ప్యాకేజీలో ఉండవు.
ఐఆర్‌సీటీసీ కాశ్మీర్ టూర్ బుకింగ్, పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.