Reading Time: < 1 minute

ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం ఈ రెండు రోజులే.. భక్తులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు

Caption of Image.

ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర భద్రత ఏర్పాట్లను  2026 సెప్టెంబర్ 21న పరిశీలించారు హైద్రాబాద్ సీపీ సజ్జనార్. భక్తుల రద్దీ, లా అండ ఆర్డర్ , ట్రాఫిక్ నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

బడా గణేష్ దర్శనం మరో రెండు రోజుల వరకే ఉంటుందని V6 తో తెలిపారు. రెండు రోజుల్లో దర్శనం బంద్ చేస్తారని చెప్పిన సీపీ.. ఈ రెండు రోజులు కీలకంగా బావిస్తున్నట్లు చెప్పారు. భక్తుల సంఖ్య ఈ రెండు రోజులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.

నిమజ్జనం కోసం కూడా  అధికారులు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారని చెప్పారు. బడా గణేష్ నిమజ్జనం కూడా సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గతంలో పండుగల వేళ ప్రజలు ఎలా సహకరించారో..గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసే విషయంలో ప్రజల సహకారం కోరుతున్నామని అన్నారు. 

శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద భక్తుల రద్దీ పెరుగుతోందన్నారు. 8వ రోజు ఇప్పటి వరకు దాదాపు లక్షనర పైగా దర్శనం చేసుకున్నారని తెలిపారు. మొత్తం కలిపి ఇప్పటి వరకు 15 లక్షలకు పైగా దర్శనం చేసుకున్నారని చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.