Reading Time: < 1 minute

Dil Raju: గణేశ్ నిమజ్జనంలో దిల్ రాజు మాస్ డ్యాన్స్.. భార్యతో కలిసి క్రేజీ స్టెప్పులు.. వీడియో వైరల్

Caption of Image.

టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు గణేశ్ నిమజ్జన వేడుకల్లో ఫుల్ జోష్‌తో సందడి చేశారు. తన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయంలో నిర్వహించిన వినాయక నిమజ్జన వేడుకల్లో ఆఫీస్ స్టాఫ్, సన్నిహితులతో కలిసి ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మ్యూజిక్‌కు తగ్గట్టుగా దిల్ రాజు వేసిన మాస్ స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాదు.. భార్య తేజస్వినితో కలిసి ఆయన డ్యాన్స్ చేసిన విజువల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ సినిమాల నిర్మాణ పనులతో బిజీగా కనిపించే దిల్ రాజు ఇలా ఫుల్ ఎనర్జీతో ఎంజాయ్ చేస్తూ కనిపించడంతో అభిమానులు, నెటిజన్లు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ నుంచి పలు క్రేజీ ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘రౌడీ జనార్దన్’, అలాగే మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ‘దేతడి’ సినిమాను దర్శకుడు ఆదిత్య రావు గంగసాని తెరకెక్కిస్తున్నారు. అలాగే వేణు యెల్దండి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎల్లమ్మ’పై కూడా ఆసక్తి నెలకొంది.

మరోవైపు బాలీవుడ్ దర్శకుడు అనీష్ బజ్మీతో ఓ అన్‌టైటిల్డ్ ప్రాజెక్ట్‌ను కూడా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా Cape of Good Filmsతో కలిసి తెరకెక్కుతోంది. ఇక 2027లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘Monster’ ప్రాజెక్ట్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవైపు వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్న దిల్ రాజు.. మరోవైపు గణేశ్ నిమజ్జన వేడుకల్లో తన మాస్ ఎనర్జీతో సందడి చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  “దిల్ రాజు మాస్ జోష్” అంటూ టాలీవుడ్ ఆడియన్స్ ట్వీట్లు పెడుతున్నారు.

©️ VIL Media Pvt Ltd.