Reading Time: < 1 minute

మూగజీవాల రక్షణ కోసం.. 20 వేల కిలోమీటర్ల  సైకిల్ యాత్ర  చేపట్టిన మంచిర్యాల యువకుడు

Caption of Image.

మూగజీవాల రోదనలకు ఓదార్పుగా.. ప్రకృతి పరిరక్షణే ధ్యేయంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఒక గొప్ప సాహస యాత్ర ప్రారంభమైంది. జంతు ప్రేమికుడు సందేశ్.. మూగజీవాల రక్షణ కోసం ఏకంగా 20 వేల కిలోమీటర్ల భారీ సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు.

నిన్న మంచిర్యాలలో ప్రారంభమైన ఈ యాత్ర,  ఇవాళ(సెప్టెంబర్ 21) చెన్నూరుకు చేరుకుంది. ‘సేవ్ ఎనిమల్స్.. సేవ్ నేచర్’ అనే నినాదంతో సాగుతున్న ఈ ప్రయాణం  సుమారు 300 రోజుల పాటు, దేశంలోని 17 శక్తిపీఠాల మీదుగా ఈ యాత్ర సాగనుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన మూగజీవాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించడం.. ఆకలితో అలమటిస్తున్న వీధి జీవులకు ఆహారం అందించడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యం.

ALSO READ : సోనియా గాంధీ ఓటర్ల జాబితా కేసు

ప్రకృతిని కాపాడుకుంటూ, మూగజీవాల పట్ల ప్రతి ఒక్కరూ దయ కలిగి ఉండేలా ప్రజల్లో చైతన్యం తేవడానికే తాను ఈ యాత్ర చేపట్టినట్లు సందేశ్ చెబుతున్నారు. 

 

©️ VIL Media Pvt Ltd.