Reading Time: < 1 minute
Producer Mythri Ravi Shankar Has Now Confirmed These Reports Fauzi Release Postponed

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘ఫౌజీ’. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక వీరోచిత సైనికుడి పాత్రలో కనిపిస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే గత కొద్దీ రోజులుగా ఫౌజీ పోస్ట్ పోన్ అవుతుందంటూ వార్తలు వెలువడుతున్నాయి కానీ మేకర్స్ వాటిని ఎక్కడ ఖండించలేదు. దాంతో అసలు ఈ ఈసినిమా రిలీజ్ విషయంలో ఫ్యాన్స్ లో కాస్త గందరగోళం నెలకొంది.

అయితే ఈ పోస్ట్ పోన్ వార్తలపై ఎట్టకేలకు స్పందించారు మేకర్స్. గడచిన రాత్రి జరిగిన ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ‘ఫౌజీ చిత్రం థియేటర్లలోకి రావడానికి కాస్త సమయం పడుతుందని, కానీ ఎప్పడు వచ్చిన ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి తర్వాత ఆ రేంజ్ మూవీ  అవుతుందని వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ప్రభాస్ సినిమాలు అనుకున్న డేట్ కు రావడం లేదు. దాంతో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవడం వంటివి మాకు అలవాటు అయిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు అభిమానుల దృష్టి అంతా కొత్త రిలీజ్ డేట్‌పైనే ఉంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.