Reading Time: < 1 minute
Tuesday Horoscope September 22 2026 These Zodiac Signs Should Think Twice

Tuesday Horoscope September 22 2026: కుంభ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వ్యాయామాన్ని క్రమం తప్పకుండా పాటించాలి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్వేతార్క గణపతి స్వామి. తెల్లజిల్లేడు పుష్పాలతో స్వామివారిని పూజించాలి. తులా రాశి వారు ట్రేడింగ్ వ్యాపారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాహసోపేత నిర్ణయాల విషయంలో తొందరపాటు తగదు. పిల్లల ఆరోగ్యం, చదువు అనుకూలిస్తాయి. గణపతి స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయాలి.

కర్కాటక రాశి వారి ఆలోచనా విధానంలో సానుకూల దృక్పథం కలిగి ఉండాలి. ఆభరణాలు, విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండటం శ్రేయస్కరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనుకూలించే దైవం.. ఐశ్వర్య గణపతి స్వామి. గణపతి స్వామికి గులాబీ పుష్పాలతో పూజ చేయాలి. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి (2026 సెప్టెంబర్ 22) ద్వాదశ రాశుల దినఫలాలు, శుభ ఫలితాల కోసం పాటించాల్సిన పరిహారాలు, పూజా విధుల వివరాలు అందించారు.